టాలీవుడ్ లో కొంతమంది హీరోలు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టే పరిస్థితులు ఉన్నాయా లేవా అనే విషయంలో మాత్రం ఇప్పుడు స్పష్టత లేదు. అయితే కొంతమంది హీరోలు మాత్రం పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు ఎక్కువగా ముందుకు రావటం లేదు అని తెలుస్తుంది. ఇటీవల రామ్ చరణ్ కి చిరంజీవి కాస్త వార్నింగ్ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియదు కానీ దానిపై మాత్రం కాస్త ఆసక్తికర చర్చలు జరిగాయి.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ పెట్టుబడి పెట్టే విషయంలో పూర్తిగా డ్రాప్ అవుతున్నట్లు సమాచారం. ఇప్పుడు రెండు మూడు సినిమాలు నిర్మిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ఇక సినిమాల్లో పెట్టుబడి పెట్టవద్దు అని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమాలో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమా కూడా ప్లాన్ చేశారు. మలయాళం రీమేక్ సినిమా లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. అయితే ఆ సినిమా పెట్టుబడి భారీగా ఉండే నేపథ్యంలో అల్లు అరవింద్ ను కూడా సినిమాలోకి తీసుకోవాలని ఆయన భావించినట్లుగా తెలుస్తుంది.

అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఇక రాంచరణ్ సినిమాలను కొనుగోలు చేసే అవకాశం లేదని ఆయన పెట్టుబడులు పెట్టాలి అంటే మాత్రం కొంత కాలం ఆగాల్సిందే అని అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే అనవసరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెట్టుబడులు వద్దు అని చిరంజీవి చెప్తున్నారు. పెట్టుబడులు పెట్టినా సరే ఇద్దరు ముగ్గురు పార్టనర్ లు ఉండే విధంగా చూసుకోవాలి అని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి రామ్ చరణ్ ఎలా వ్యవహరిస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: