తెలుగు సినిమాల్లో మాస్ సినిమాలతో అప్రతిహతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో చిరంజీవి. మాస్ సినిమాలే ఆయన్ను మెగాస్టార్ ను చేశాయి. అవే సినిమాలు చిరంజీవిని తిరుగులేని నెంబర్ వన్ హీరోగా మూడు దశాబ్దాలకు పైగా నిలబెట్టాయి. అటువంటి సినిమాల లిస్టులోకి వచ్చేదే ‘రౌడీ అల్లుడు’. చిరంజీవి కెరీర్లో భారీ మాసివ్ హిట్ గ్యాంగ్ లీడర్ తర్వాత వచ్చిన ఈ సినిమా ఆ క్రేజ్ ను మరింతగా నిలబెట్టింది. సినిమాలో చిరంజీవి మాస్ క్యారెక్టర్ ఆయన ఇమేజ్ కు మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా విడుదలై నేటితో 29 ఏళ్లు పూర్తయ్యాయి.


కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1991 అక్టోబర్ 18న విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ పోషించారు. కథలో చిరంజీవి మరో సినిమా దొంగమొగుడు ఛాయలు కొంత కనిపిస్తాయి. కానీ.. చిరంజీవి ఈ సినిమాలో చేసిన వన్ మ్యాన్ షోకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చిరంజీవి మాస్ యాక్టింగ్ కు మెగా ఫ్యాన్స్ కు పూనకాలే వచ్చాయి. ‘బాక్సు బద్దలైపోద్ది..’ అని చిరంజీవి చెప్పిన మేనరిజమ్ మోగిపోయింది. ఇప్పటికీ చిరంజీవి బ్రాండ్ గా ముద్ర పడిపోయింది. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.


రఫ్ గెడ్డంతో చిరంజీవి కామెడీ టైమింగ్ ఈ సినిమా ప్రత్యేకం. బప్పీలహరి సంగీతం సినిమాకు మేజర్ ఎస్సెట్. పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. శ్రీ సాయిరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.వెంకటేశ్వర రావు, పంజా ప్రసాద్సినిమా నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్వవహరించారు. ఈ సినిమాను తన చెల్లెళ్ల కోసం నిర్మిస్తున్నట్టు అప్పట్లో చిరంజీవి ప్రకటించారు. అద్భుత విజయం సాధించిన ఈ సినిమా 33 సెంటర్లలో 100 రోజులు రన్ అయింది. చెన్నైలో శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: