సోషల్ మీడియాలోకి అడుగు పెట్టాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయంతో అభిమానులను సర్ ప్రైజ్ చేయాడానికి చూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ మళ్లీ మొదలు కావడంతో అందులో బిజీగా ఉన్నాడు చరణ్. ఈ మల్టీ స్టారర్ మూవీ లో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఆయన ఇందులో కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరిసీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.


సినిమా కాక మనోడు తన తండ్రి చిరంజీవి హీరోగా నటిస్తోన్న మరో సినిమా ఆచార్యలో కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడు. అయితే ఈ రెండు రోల్స్ కోసం రెండు లుక్స్ చేయాల్సి ఉంటుంది. కేవలం హెయిర్ స్టైల్ మాత్రమే కాక బాడీలో కూడా మార్పులు చూపించాల్సి ఉంటుంది. ఆచార్యలో దాదాపు ముప్పై నిమిషాల పాటు కనిపించే పాత్రలో ఆయన నక్స లైట్‌ పాత్రలో కనిపించనున్నాడని ముందు నుండి గట్టి ప్రచారం అయితే జరుగుతుంది. చరణ్ పోషించే ఈ పాత్ర సినిమాకే హైలైట్ కానుందని అంటున్నారు.
 


దానికి కాస్త గెడ్డాలు మీసాలు పెంచినలుక్ లో కనపడాలి కానీ ఆర్.ఆర్.ఆర్ లుక్ అంటే మళ్ళీ కోర మీసంలోకి మారాలి. అయితే మొన్నీమధ్య గడ్డం, మీసాలతో కనిపించిన ఆయన మళ్ళీ లుక్ మార్చేశాడు. అయితే ఆ లుక్ సంగతి ఎలా ఉన్నా, తాజాగా ఆయనకు సంబంధించి బయటకు వచ్చిన ఒక లుక్ లో మాత్రం చాలా డల్ గా కనిపిస్తున్నాడు. అయితే ఆయన అలసిపోయినప్పుడు ఆ పిక్ దిగారా లేక క్యారెక్టర్ మౌల్దింగ్ కోసం డైటింగ్ లాంటివి చేసి అలా అయ్యారా ? అనేది తెలియాలసివుంది. అతన్ని అలా చూసి ఫ్యాన్స్ మాత్రం తెగ బాధ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: