సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ డైరెక్టర్ కి ఉన్న జయాపజయాలు పక్కన పెట్టి ఆ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చితే ఆ సినిమా చేసేటప్పుడు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వడననే పేరుంది. డైరెక్టర్ ఏది చెప్తే అదే గుడ్డిగా ఫాలో అవుతాడట మహేష్. అలా చాలా విజయాలు సాధించాడు అలాగే ఎన్నో డిజాస్టర్స్ కూడా అందుకున్నాడు. మహేష్ కు ఓ డిజాస్టర్ సినిమా ఇస్తే… అది ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే… మరోసారి ఆ డైరెక్టర్ జోలికి పోడు మహేష్ బాబు.

యువరాజు తర్వాత వై వి యస్ చౌదరితో, టక్కరి దొంగ తో జయంతి సి పరాన్జీ ని, 'సైనికుడు' చిత్రం చేసిన గుణశేఖర్ తో,  ‘అతిథి’ తరువాత సురేందర్ రెడ్డి తో ‘ఖలేజా’ తరువాత త్రివిక్రమ్ తో, 'ఆగడు' చిత్ర దర్శకుడు శ్రీను వైట్లతో   కానీ… ‘1 నేనొక్కడినే’ తరువాత సుకుమార్ తో, 'బ్రహ్మ్మోత్సవం' తర్వాత శ్రీకాంత్ అడ్డాలని పక్కన పెట్టాడు. మిగతా అన్ని సినిమాల సంగతి ఏమో కానీ ‘అతిథి’ సినిమా రిలీజ్ అయి నేటికి 13 ఏళ్ళు.

ఈ సినిమ ఫట్ అయ్యుండచ్చు కానీ మహేష్ బాబు కెరీర్ లో అద్భుతమైన టెక్నికల్ ఫిల్మ్ ఇదేనని చెప్పచు. అప్పటి వరకు మహేష్ కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అతిథి మాత్రం టెక్నికల్ గా చాలా గ్రాండ్ లుక్ లో కనిపించింది. సురేందర్ రెడ్డి టేకింగ్ కు అప్పట్లోనే ఫిదా అయిపోయిన మహేష్ అలాంటి దర్శకుడితో మళ్లీ మళ్లీ పని చేయాలని ఉందని అప్పట్లోనే చెప్పాడు. ఇక  అతిథి సినిమాలో హీరోయిన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించింది అమృతారావు. ఈ సినిమా తరువాత మరో తెలుగు సినిమాలో ఆమె కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: