బుల్లితెర మీద రకరకాల షోలతో తన సత్తా చాటుతుంది స్టార్ మా. మా కాస్త స్టార్ మాగా మారి సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంది. ఆడియెన్స్ కు ఏం కావాలో అది తెలుసుకుని అలాంటి షోలతో అలరిస్తుంది. స్టార్ మా సీరియల్స్, రియాలిటీ షోలతో 40 శాతం ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అందుకే లేటెస్ట్ రిపోర్ట్స్ లో ఇండియాలో స్టార్ మా నంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానెల్ గా నిలిచింది.

స్టార్ మా సీరియల్స్ సూపర్ అంటున్న ఆడియెన్స్. ఎక్కువ డ్రామా లేకుండా సీరియల్స్ ఉండటం. స్టార్ మా సీరియల్స్ కు ఎక్కువ క్రేజ్ వచ్చేలా చేసింది. అందులో వస్తున్న కార్తీకదీపం సినిమా సూపర్ హిట్ సీరియల్. ఇక ఈమధ్యనే మొదలైన కొన్ని సీరియల్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఎవర్ గ్రీన్ బిగ్ బాస్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యింది. సీజన్ 1 నుండి నడుస్తున్న సీజన్ 4 వరకు స్టార్ మా రేటింగ్స్ ను ఎప్పుడు టాప్ లో ఉంచేందుకు బిగ్ బాస్ కృషి చేస్తుంది.

ఈ సీజన్ లో నాగార్జున హుశారైన యాంకరింగ్ మరింత జోష్ ఇస్తుంది. ఇక ప్రస్తుతం స్టార్ మా అటు సీరియల్స్, ఇటు రియాలిటీ షోస్ తో పాటుగా బిగ్ బాస్ తో కూడా ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంది. అందుకే ఈ ఛానెల్ ఇండియాలో నంబర్ 1 గా నిలిచింది. తప్పకుండా స్టార్ మా ఇలానే తన స్థానాన్ని కాపాడుకునే షోలను చేస్తుందని చెప్పొచ్చు. వెరైటీ షోలు చేసేందుకు ప్రయత్నిస్తున్న స్టార్ మా రేటింగ్స్ లో కూడా అదరగొట్టేస్తుంది.                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: