సూపర్ స్టార్ మహేష్ సినిమాలో హీరోయిన్ గా ఎట్టకేలకు ఛాన్స్ అందుకుంది కీర్తి సురేష్. నేను శైలజతో ఎంట్రీ ఇచ్చి మహానటితో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న ఈ అమ్మడు మహేష్ పక్కన నటిస్తే చూడాలని ఫ్యాన్స్ అనుకున్నారు ఇప్పుడు వారి కల నెరవేరబోతుంది. మహేష్ సరసన కీర్తి సురేష్ రొమాన్స్ కు రెడీ అయ్యింది. పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ ను కన్ఫాం చేశాడు మహేష్. ఆమె బర్త్ డే సందర్భంగా శనివారం స్పెషల్ ట్వీట్ చేసి విష్ చేశాడు.

సూపర్ టాలెంట్ హీరోయిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మనం కలిసి చేసే సినిమా మీ కెరియర్ లో బెస్ట్ సినిమా కావాలని మహేష్ ట్వీట్ చేయగా కీర్తి సురేష్ దానికి రిప్లై గా థ్యాంక్ యు సర్ మీతో కలిసి పనిచేయాలని ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నానని అన్నారు. ఇక మహేష్, కీర్తి సురేష్ జోడీ గురించి మాట్లాడితే అందంతో మహేష్ అభినయంతో కీర్తి ఇద్దరు సూపర్ జోడీ అనిపించుకుంటారు.  

పక్కింటి అమ్మాయిగా కనిపించే కీర్తి సురేష్ యువ హీరోల సినిమాల్లో నటిస్తూ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిలో చేసినా ఆమె కెరియర్ కు ఉపయోగపడలేదు. మహేష్ సినిమాతో మళ్లీ ఆమె అదరగొట్టాలని చూస్తుంది. ఈ సినిమాతో పాటుగా నితిన్ రంగ్ దే లో కూడా కీర్తి సురేష్ నటిస్తుంది. సినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పించింది రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రంగ్ దే పక్కా హిట్ అనే టాక్ వస్తుంది.    

                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: