టాలీవుడ్ లో నిన్ను కోరి సినిమా తో పరిచయమై ఫీల్ గుడ్ మూవీస్ ని కొత్తగా చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.. తొలి  సినిమా ని ఆయన ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ముగ్డులయిపోయారు..లైన్ కాస్త పాతదే అయినా అందులోని కంటెంట్ కొట్టగా నింపి ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమయ్యాడు.. నాని లాంటి హీరో తో అంత సింపుల్  కథ ఏంటి అని అందరు అనుమానపడ్డా సినిమా ను హిట్ రేంజ్ కి తీసుకెళ్ళాడు అంటే త్వరలోనే పెద్ద డైరెక్టర్ అయ్యే సూచనలు ఉన్నాయని ప్రేక్షకులకి అర్థమయిపోయింది. కమర్షియల్ అంశాలు లేకపోయినా మూడు పాత్రల మధ్య అయన చేసిన మేజిక్ ని ఇప్పటికి ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు..

ఇక రెండో ప్రయత్నంగా నాగ చైతన్య తో మజిలి సినిమా చేసి ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేశారు. ఈ సినిమా తో మొదటి సినిమాలో పడ్డ ఒకటో రెండో నెగెటివ్ మార్కులు కాస్త పాజిటివ్ గా మారిపోయాయి.. సమంత లాంటి నటిని వంతశాతం వాడుకుని సినిమా కు అమె ద్వారా ఎంతో లాభం చేకురేలా చేసుకుని రెండో హిట్ ఓ రేంజ్ లో కొట్టాడు.. ఇక మూడో సినిమాగా మళ్ళీ నాని తో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తునాడు.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలుండగా ఈ సినిమా కరోనా వల్ల ఆగిపోయింది..

హైదరాబాద్ లో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మూవీ టీమ్ చిత్రీకరణ చేశారు. నాని - రీతూ వర్మ పాల్గొంటున్న కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు యూనిట్ లోని ఒకరికి కరోనా సోకిందట. ఆ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడో అనే అనుమానంతో ముందు జాగ్రత్తగా షూటింగ్ నిలిపివేసి.. అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: