గత కొన్ని సినిమాలనుండి రామ్ కి పెద్ద గా హిట్స్ రావట్లేదు అయితే పూరి జగన్నాధ్ సినిమా తో రామ్ కం బ్యాక్ చేశాడు.. ఇష్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి అటు పూరి, ఇటు రామ్ లు ఇద్దరు సరైన టైం లో హిట్ కొట్టారు.. ఇక పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో సినిమా ఓకే చేయించుకోగా రామ్ తనకు హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల తో ఓ తమిళ రీమేక్  ని చేయడానికి  రంగం సిద్ధం చేసుకున్నాడు.. అయితే రెడ్ సినిమా రామ్ కి నిరాశనే మిగిల్చింది.. ఆ సినిమా విడుదల కాకముందే రామ్ పై ఆ సినిమా ప్రభావం చూపెడుతుంది..

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేదు. అసలు రెడ్ సినిమా ను చూస్తుంటే అదోలా ఉంది.. రామ్ అభిమానులు ఈ సినిమా ను ఎలా ఒప్పుకున్నాడని అడుగుతున్నారు.. వరుసగా రెండు సినిమాలు చేసిన కిషోర్ తిరుమల తో మరో స్ట్రైట్ సినిమా చేస్తే బాగుండేది ఇలా రీమేక్ ని నమ్ముకుని ఎందుకు బరిలోకి దిగాడు అని అంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో చాల మల్లగుల్లాలు పడుతున్నారు యూనిట్ సభ్యులు. ఈ సినిమా ను OTT కి ఇవ్వాలా లేదా ధియేటర్స్ ఓపెన్ అయ్యేదాకా ఉండాలా అన్న ఆలోచనలో ఉన్నారు.. ఇప్పటికే నాని వి సినిమా OTT  లో రిలీజ్ కాగా ఫాన్సీ అమౌంట్ ఆఫర్ వస్తే దీన్ని కూడా OTT కి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారట..

ఇక ఈ సినిమా తర్వాత తాను చేయబోయే సినిమా పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు రామ్.. తాజాగా గరుడవేగా ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాస్తవానికి ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ కన్నా ముందే తెరకెక్కాలి..  రాజశేఖర్ మార్కెట్ గురించి పట్టించుకోకుండా ‘గరుడవేగ’ను భారీ బడ్జెట్లో తీశాడు ప్రవీణ్. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే.. ఓవర్ బడ్జెట్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. రామ్‌తో అతను చేయాలనుకున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సైతం బడ్జెట్ లెక్కలు ఘనంగా ఉండటంతో ఇది వర్కవుట్ కాదని రవికిషోర్ పక్కన పెట్టేశారని గుసగుసలు వినిపించాయి. అయితే గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’తో అతను బ్లాక్‌బస్టర్ విజయాన్నందుకున్నాడు. ఈ సినిమాతో అతడి మార్కెట్ ఎంతో పెరిగింది. దీని తర్వాత చేసిన ‘రెడ్’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. దానికి మంచి బిజినెస్ కూడా జరిగింది. దీంతో రవికిషోర్‌కు రామ్-ప్రవీణ్ సినిమా మీద పెద్ద బడ్జెట్ పెట్టడానికి ధైర్యం వచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: