చిరంజీవి పవన్ కళ్యాణ్ లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాలలోకి వచ్చి అక్కడ రాణించ లేకపోవడంతో తిరిగి యూటర్న్ తీసుకుని సినిమాలలో నటిస్తున్నారు. 9 సంవత్సరాల గ్యాప్ తరువాత చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ రికార్డులు క్రియేట్ చేయడంతో తెలుగు ప్రేక్షకులలో చిరంజీవి తనకున్న స్థానాన్ని పదిలపరుచుకున్నాడు.


‘అజ్ఞాతవాసి’ తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ ఇంకా విడుదల కాకుండానే ఏకంగా 4 సినిమాలలో పవన్ నటిస్తున్నట్లు ప్రకటనలు రావడం పవన్ స్టామినాను సూచిస్తోంది. ఇది ఇలా ఉండగా చిరంజీవి వచ్చే ఏడాది 150 కోట్లు సంపాదించబోతున్నాడు అంటూ ఇండస్ట్రీలోని కొందరు వేస్తున్న అంచనాలు హాట్ టాపిక్ గా మారాయి.


క్రితం సంవత్సరం విడుదలైన ‘సైరా’ కొంతవరకు చిరంజీవికి నష్టాలు కల్గించింది అన్నవార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆనష్టాలను కవర్ చేసుకోవడానికి చిరంజీవి కూడ ప్రస్తుతం సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ‘ఆచార్య’ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే రాబోతున్న విజయదశమి రోజున చిరంజీవి నటించబోయే ‘వేదాళం’ తెలుగు రీమేక్ కు సంబంధించి పూజా కార్యక్రమాలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ‘ఆచార్య’ మూవీ షూటింగ్ అయిపోయిన తరువాత ఈమూవీలో నటిస్తూనే చిరంజీవి వినాయక్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ లో కూడ నటించబోతున్నాడు.


ఈమూవీలతో పాటు వచ్చే ఏడాది చిరంజీవి బాబి దర్శకత్వంలో కూడ ఒక మూవీని చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దీనితో వచ్చే ఏడాది చిరంజీవి ఒకేసారి మూడు సినిమాలను లైన్ లో పెట్టడం వల్ల అతడికి 150 కోట్ల పారితోషికం వస్తుంది అన్న అంచనాలు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ లో నటిస్తున్నందుకు రోజుకు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు అన్న గాసిప్పులు వస్తున్న పరిస్థితులలో రాజకీయాలను వదిలి తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకుని ఇండస్ట్రీ పై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే చిరంజీవి పవన్ కళ్యాణ్ లు సంపాదిస్తున్న సంపాదన ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: