కరోనా పరిస్థితుల కారణంగా ధియేటర్లు మూత పడటంతో టాప్ హీరో సినిమాల సందడి కనుమరుగైపోయింది. దీనితో టాప్ హీరోల అభిమానులు తమ స్టామినాను చూపించి తమ హీరోలను ఎలివేట్ చేసుకోవడానికి సోషల్ మీడియానే రంగంగా మార్చుకున్నారు.


గత కొన్ని నెలలుగా టాప్ హీరోల పుట్టినరోజులు వస్తే చాలు వారి పేరు మీద హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి రికార్డులు క్రియేట్ చేయడమే ఒక పనిగా పెట్టుకున్నారు.  ఈ హడావిడితో కొందరు టాప్ హీరోలకు సంబంధించి ప్రపంచ రికార్డులు కూడ క్రియేట్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితులలో ఈనెల 22న రాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ లో  సినిమాలోని ఎన్టీఆర్ లుక్ వీడియోకు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని నందమూరి ఫ్యాన్స్ ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలుపెట్టి తమ సహచర అభిమానులను అభిమాన సంఘాలను ఇప్పటి నుంచే అలర్ట్ చేస్తున్నారు అన్నవార్తలు వస్తున్నాయి.


రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర మేకింగ్ తో ఉండబోతున్న ఈ వీడియోకు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ వచ్చే విధంగా భారీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఫ్యాన్స్ ఈవిషయమై ట్రెండ్ అలర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 24 గంటల పాటు హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో కంటిన్యూస్ గా షేర్ చేస్తూ వీడియోను కూడా పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో ఒకేసారి ఒకే రోజు రెండు రికార్డులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.


తాము హడావిడి చేద్దాము అని ఎంతో ఆశపడ్డ జూనియర్ పుట్టినరోజు కరోనా పరిస్థితులు వల్ల పూర్తిగా నీరుకారిపోవడంతో ఈసారి ఈ అవకాశాన్ని వదులుకునే ఆలోచనలో తారక్ అభిమానులు లేరు.  ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని లీకులు వస్తున్న పరిస్థితులలో అలాంటి పవర్ ఫుల్ సీన్స్ రామ్ చరణ్ పై రాజమౌళి పెడుతున్నాడా లేదా అంటు ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే చరణ్ అభిమానులు విపరీతంగా భయపడిపోతున్నారు అన్న లీకులు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: