బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఇపుడు ట్రాక్ లో పడింది. కరోనా టైం లో ఇది అతి పెద్ద వినోదంగా మారింది. సరైన టైంలో వదిలిన ఈ షోకి బాగానే ఆదరణ లభిస్తోంది.  ఈసారి చేసిన అనేక మార్పులు కూడా షో రక్తి కట్టడానికి కారణం అవుతున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో ఇపుడు ఆరవ వారం నడుస్తోంది. పదమూడు మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఒకరు ఈ రోజు ఎలిమినేట్ కాబోతున్నారు. రానున్న వారాలలో షో మరింత సీరియస్ గా సాగనుంది.

ఈ నేపధ్యంలో చూసుకుంటే బిగ్ బాస్ విజేత ఎవరూ అన్న చర్చ కూడా మెల్లగా స్టార్ట్ అవుతోంది. ఎందుకంటే ఇపుడు పది మంది దాకా ఉంటే అందులో అయిదుగురు టాప్ ఫైవ్ లోకి వస్తారు. కాబట్టి ఇపుడు ఆడియన్స్ కూడా ఎవరికి వారు ఆ లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరి టాలెంట్ ఏంటో కూడా ప్రూవ్ కావడంతో టాప్ ఫైవ్ లో నిలబడేది ఎవరు, చివరి దాకా పోటీలో ఉండేది ఎవరూ అన్న అంచనాలు కూడా వేసుకుంటున్నారు.

ఈసారి బిగ్ బాస్ షోలో జబర్దస్త్ ఫేమ్ అవినాష్ తనదైన కామెడీ పంచులతో అదరగొడుతున్నాడు. మొత్తానికి మొత్తం హౌజ్ లో ఆయనొక్కడే ఎంటర్టైన్మెంట్ గా మిగిలాడు. ఇది స్వయంగా నాగార్జున కూడా అయనకు ఇచ్చిన కితాబుగా ఉంది. టాస్కులను ఫేస్ చేస్తున్నాడు. గేమ్  జాగ్రత్తగా ఆడుతున్నాడు. అదే సమయంలో లేడీ కంటెస్టెంట్లతో కూడా సరదాగా ఉంటున్నాడు. మొత్తానికి మల్టీ టాలెంటెడ్ గా అవినాష్ ఈ సీజన్ లో కనిపిస్తున్నాడు.

ఇక గత వారం హౌజ్ ని వదిలేసి వెళ్ళిన గంగవ్వ బిగ్ బాస్ విజేత ఎవరో చెప్పేసింది. అవినాష్ కచ్చితంగా విజేతగా నిలుస్తాడు అంటూ ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. మారి హౌజ్ లో అయిదు వారాల పాటు ఉన్న గంగవ్వ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఇప్పటిదాకా  అయితే అవినాష్ రేసులో బాగానే ముందున్నాడు. ముందు ముందు ఆయన ఎలా తన పెర్ఫార్మెన్స్ చూపిస్తాడో దాన్ని బట్టే విజేత అవుతాడా లేదా  అన్నది తేలుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: