బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో రావడానికి చాలా కష్టపడాల్సివచ్చిందట. ఒక వైపు కరోనా వీర విహారం చేయడంతో పాటు మరో వైపు అనేకానేక సమస్యలు. మరీ ముఖ్యంగా ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక అతి పెద్ద భారంగా మారిందని అంటున్నారు. ఎప్పటిమాదిరిగానే సెలిబ్రిటీలను ఈసారి కూడా పిలిచారుట. వారిని ఎలాగైనా హౌజ్ లోకి తీసుకువస్తే ఎంటర్టైన్మెంట్ బాగా ఉంటుందని ఆడియన్స్ అట్రాక్ట్ అయి టీయార్పీ రేటింగ్ అదిరిపోతుందని చాలా అంచనాలు వేసుకున్నారు. దాని కోసం అనేక మందిని సంప్రదించినా కూడా  ఎవరూ ఎందుకో ముందుకు రాలేదు. అదే సమయంలో బిగ్ బాస్ రెమ్యునరేషన్లు కూడా భారీ ఎత్తున పెంచినా కూడా చాలా మంది టాప్ సెలిబ్రిటీస్ ఇటు వైపు కూడా చూడలేదు.

ఈ నేపధ్యంలో ఈసారి అంతగా ముక్కూ ముఖం తెలియని వారితోనే బిగ్ బాస్ ని నింపేశారు. వారితోనే షో స్టార్ట్ చేశారు. దాంతో బిగ్ బాస్ సీజన్ చాలా డల్ గా ప్రారంభమైంది. ఎవరూ తెలిసిన వారు కాకపోవడంతో మొదట్లో ఆడియన్స్ పట్టించుకోలేదు కానీ పోనూ పోనూ వారు బాగానే రిజిష్టర్ అయ్యారు. ఇక ఎవరు కూడా ఆడియన్స్ కి తెలియకపోవడం వల్ల ఎవరి మీద ప్రత్యేకంగా ఫావరిజాలు ఈసారి లేవు. ప్రతీ వారం గేమ్ ప్లాన్ మారుతుంది. దాని ప్రకారం టాలెంట్ కూడా మారుతుంది.

దాన్ని బట్టే ఆడియన్స్ కూడా ఓట్లు వేస్తున్నారు. ఓ విధంగా బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా తలనొప్పి లేకుండా ఉందిట. సెలిబ్రిటీస్ ని తెస్తే వారిని కనీసం కొన్ని వారాలు అయినా హౌజ్ లో ఉంచాలి. ఇక వారి విషయంలో ఆడియన్స్ కూడా సీరియస్ గానే ఉంటారు. దాంతో జనాల్లో ఓట్లు తగ్గినా వారిని బయటకు పంపినా కూడా గొడవలు ఇబ్బందులు వస్తాయి. దీంతో ఈసారి అలాంటివి ఏవీ లేవు అని అంటున్నారు. పైగా రెమ్యునేషన్స్ కూడా సగానికి  సగం తగ్గిపోయాయి.

ఎవరు హౌజ్ లో ఉన్నా గేమ్  మాత్రం బాగానే సాగుతోంది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి నుంచి కొత్త వారినే ప్రతీ సీజన్ లో తీసుకురావాలనుకుంటున్నారని తెలుస్తోంది. దాని వల్ల కలిగే లాభాలు ఏంటో సీజన్ ఫోర్ నిరూపించిందని కూడా చెబుతున్నారు. సెలిబ్రిటీస్ అని నెత్తిన పెట్టుకున్నా కూడా టీయార్పీ రేటింగ్ మాట దేవుడెరుగు వివాదాలు పెరుగుతున్నాయని గ్రహించడం వల్లనే ఇలా ఫిక్స్ అయ్యారని అంటున్నారు. చూడాలి సీజన్ 5 ఎలా డిజైన్ చేస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: