మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్ళడం కారణంగా సినిమాల నుండి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. ఆ తరవాత మూడేళ్ల కిందట తిరిగి ఆయన తెర మీద కనిపించాడు. దీనితో  అభిమానులకు పండగ మాదిరి ఫీల్ వచ్చింది. మొదట ఆయన  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు తిరిగి సినిమాల్లోకి వచ్చేదే లేదని చెప్పిన సంగతి తెలిసినదే. కానీ ఆయనకి ఆ  రంగంలో ఊహించినంత  రాణించ లేకపోయారు. దీని కారణంగా ఆయన తిరిగి సినిమాల్లోకి రాక తప్పలేదు. కానీ ఆయన రీఎంట్రీ తో ఎంచుకున్న సినిమా చాలా మందికి నచ్చలేదు.

ఖైదీ సినిమా  తమిళ 'కత్తి'ని రీమేక్ కావడం.... కధ తెలిసినది కారణంగా కొంచెం సర్ప్రైజ్ కూడా మిస్ అయ్యింది. కానీ ఆయన రీఎంట్రీ మూవీ కాబట్టి దాన్ని ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఖైదీ సినిమా తర్వాత   'సైరా'తో అభిమానులను అలరించాడు చిరు. ఇవి ఇలా ఉండగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న 'ఆచార్య' మీద కూడా మంచి హోప్స్ ఉన్నాయి. మరి ఆ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. లాక్ డౌన్ టైంలో కొత్తగా ఎగ్జైటింగ్ ప్రాజెక్టులతో హీరోలు  బిజీగా ఉంటే చిరు మాత్రం వరుసబెట్టి మళ్లీ రీమేక్‌ల మీద పడటం చాలా మందికి నచ్చడం లేదు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్ కూడా చిరు ఓకే చెప్పిన సంగతి తెలిసినదే.. ఇక్కడితో వదిలేయక వి.వి.వినాయక్ డైరెక్షన్లో 'లూసిఫర్' రీమేక్ కోసం కూడా రంగం సిద్ధం చేశారు. ఇలా రొటీన్ స్టోరీస్ ని, రీమేక్ సినిమాలని ఎంచుకోవడం వల్ల అభిమానవులకి నిరాశే కలుగుతోంది. ఇప్పుడు అజిత్ నటించిన తమిళ హిట్ 'ఎన్నై అరిందాల్' రీమేక్ మీద చిరు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. 'ఎన్నై అరిందాల్' తెలుగులో 'ఎంతవాడు గాని' పేరుతో అనువాదమైంది. . తెలుగులో రిలీజై, ఓటీటీలో అందుబాటులో ఉన్న, పాత సినిమాను రీమేక్ చేయడానికి చిరుకు ఎందుకు ఇంట్రెస్ట్ కలుగుతుందో తెలియదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: