దర్శక దీరుడు జక్కన్న భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో తారక్ లుక్ ఎలా ఉంటుంది. ఆయన పాత్రను జక్కన్న ఏ విధంగా తీర్చిదిద్దాడు అని తెలుసుకోవాలని అభిమానులు కొన్ని నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే శనివారం రాత్రి ఆర్ఆర్ఆర్ టీం ఎన్టీఆర్ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. మరో ఐదు రోజులలో భీమ్ కోసం రామరాజు సర్‌ప్రైజ్ గిఫ్ట్ తేనున్నాడు అని సరికొత్త పోస్టర్ విడుదల చేశారు.

అయితే చరిత్ర, ఫిక్షన్‌ అంశాల కలబోత ఆధారంగా రాజమౌళి రౌద్రం రణం రుధిరం( ఆర్ఆర్ఆర్) అనే సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అయితే  వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్ర షూటింగ్ మార్చి నుండి కరోనా వలన ఆగిపోయింది. రీసెంట్‌గా తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ఎన్టీఆర్‌కి సంబంధించిన సన్నివేశాలతో తాజా షెడ్యూల్ జరిపారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కాబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. డీవీవీ దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: