పవన్ కళ్యాణ్ కి ముందు ట్యాగ్ ఉంటుంది. అదే పవర్ స్టార్ అని.  పవన్ కి ఎవరికీ లేనంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. వారు పెద్ద తెర మీద పవన్ని చూస్తే పూనకాలే పోతారు. తమ అభిమాన కధానాయకుడు అలా విలన్లను చితక్కొడుతూ అందమైన హీరోయిన్లతో ఆడుతూ పాడుతూ హీరోయిజం చాటాలని వారు గట్టిగా కోరుకుంటారు. ఇందులో తప్పేమీ లేదు కూడా. ఎందుకంటే పవన్ వారి దేవుడు కాబట్టి. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత కొన్ని కండిషన్లు తనకు తానే పెట్టుకున్నారు అని అంటున్నారు. అవేంటి అంటే ఆయన గతంలో మాదిరిగా హీరోయిన్లతో డ్యాన్సులు పెద్దగా వేయని పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నారుట‌.

అదే సమయంలో మీనింగ్ ఫుల్ రోల్స్ నే ఆయన ఇష్టపడుతున్నారు. నిజానికి పవన్ గతంలో కూడా హీరోయిన్లతో పెద్దగా డ్యాన్సులు చేసిన సినిమాలు లేవు. ఆయన నిజాయతీగా చెప్పుకుంటారు. తాను అన్నయ్య చిరంజీవిలా డ్యాన్సులు చేయలేనని, అయితే ఆయన సినిమాల్లో హీరోయిన్లతో  డ్యూయెట్లు పాడేవారు. తనకు తోచిన డ్యాన్సులు చేసేవారు. అవే ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకునేవి. కానీ ఇపుడు మాత్రం పవన్ ఆ  తరహా డ్యూయెట్లకు కూడా దూరమని చెప్పడంతో ఆయన సినిమాలను ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారా అన్న డౌట్లు అయితే ఉన్నాయి.

పవన్ మిడిల్ ఏజ్ రోల్స్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆయన రీ ఎంట్రీ తరువాత ఒప్పుకున్న చిత్రం వకీల్ సాబ్ లో అలాంటి క్యారక్టరే కావడం విశేషం. ఈ రోల్ లో పవన్ కి ఎక్కువగా కోర్టులో వాదనలు, ఇంటెక్చువల్ ఫైటింగ్స్ మాత్రమే ఉంటాయి తప్ప బండగా ఒకరి మీదన ఒకరు పడి కొట్టుకోవడాలు ఉండవు. ఇక పవన్ దీని తరువాత అయ్యప్పన్ కోషియం మూవీని కూడా చేస్తారని అంటున్నారు. ఆ సినిమా కూడా అలాంటిదే. దాంతో పవన్ కుర్ర చేష్టలు చేసే సినిమాలు ఇప్పట్లో ఉండవని అంటున్నారు. పవన్ రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. అందువల్ల తన మీద మచ్చ రాకుండా చూసుకోవడానికి ఆయనకు ఆయనే పెట్టుకున్న నియమంగా చెబుతున్నారు. ఏం అనుకున్నా కూడా పవన్ నుంచి హుషారెత్తించే సాంగ్స్ రాకపోతే ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారో ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: