దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ లు ప్రారంభం కాబోతున్నాయి. అగ్ర హీరోలకు సంబంధించిన షెడ్యూల్స్ లో ఇప్పుడు తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇందులో భాగంగా టాలీవుడ్ లో మళ్ళీ సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి.టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ rrr సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయింది. అక్టోబర్ 5న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇప్పుడు rrr సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఇక కరోనా భయాన్ని పక్కన పెట్టి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌తో పాటు ఓ యాడ్ షూట్‌లో కూడా పాల్గొనడం విశేషం.

 భారత దేశంలో విశేష ప్రజాదరణ పొందిన శీతలపానీయం ఫిజ్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించారు. తాజాగా 'బీ ఫిజ్' పేరిట కొత్త ఉత్పత్తి వచ్చింది. ఈ ప్రొడక్ట్ కు సంబంధించిన సరికొత్త యాడ్ లో ఎన్టీఆర్ దర్శనమించి అందరినీ ఆకట్టుకున్నాడు.ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం స్లిమ్ గా మారిన ఎన్టీఆర్ ఈ యాడ్ లో మరింత ఉత్సాహంగా కనిపించారు.తనదైన శైలిలో స్టెప్పులు వేసి అలరించారు. `ఇంట్రడ్యూసింగ్ బీ ఫిజ్. బీ ద ఫిజ్` అంటూ డైలాగ్ చెప్పారు. తాజాగా ఈ బీ ఫిజ్ యాడ్‌ను ఎన్టీఆర్ పోస్ట్ చేస్తుంది.

 ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియో లో ఎన్టీఆర్ లుక్స్ కి ఫిదా అవుతూ... ఆ వీడియో ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరోని సరికొత్త లుక్ లో చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక rrr సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ కొమురం భీం టీజర్ ఈనెల 22న విడుదల విడుదల చేయనుంది చిత్రబృందం.ఈ టీజర్ కోసం నందమూరి అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: