మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా వస్తుంది. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు రవితేజ. ఈ సినిమాకు ఖిలాడి టైటిల్ ఖరారు చేశారు. సినిమాలో రమేష్ వర్మ డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఇక ఖిలాడి సినిమాలో డింపుల్ హయతి, మెనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తుంది.

ఏ స్టూడియోస్ పెన్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను హవీష్ ప్రొడక్షన్ లో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ ఒక్క హిట్టు కొట్టలేదు. క్రాక్ తో హిట్ ట్రాక్ ఎక్కి ఖిలాడితో అది కొనసాగించాలని చూస్తున్నాడు. ఆల్రెడీ రమేష్ వర్మతో వీర సినిమా చేశాడు రవితేజ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేదు. అయితే ఖిలాడి మాత్రం గట్టి టార్గెట్ తో వస్తుంది.

రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న రమేష్ వర్మ రవితేజతో ఈసారి పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాతో మాస్ క్లాస్ ఆడియెన్స్ ను రవితేజ అలరిస్తాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇదే కాకుండా మారుతి డైరక్షన్ లో కూడా రమేష్ వర్మసినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమాకు సంబందించిన అఫీషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది.                                                                     

మరింత సమాచారం తెలుసుకోండి: