అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ మూవీగా వస్తున్న పుష్ప మీద భారీ హోప్స్ ఉన్నాయి. అందుకే వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. ఊర మాస్ గా ఉండబోతున్న ఈ రోల్ లో బన్నీని చాలా వేరియేషన్స్ లో చూపించాలని ఫిక్స్ అయ్యాడు సుకుమార్.

ఇక ఈ సినిమాలో స్టోరీ, స్క్రీన్, యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటుగా ఎమోషనల్ సీన్స్ కూడా అదిరిపోతాయని తెలుస్తుంది. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రని ఆడియెన్స్ అంతలా ఓన్ చేసుకోడానికి ఎమోషన్ కూడా ఓ కారణమని చెప్పొచ్చు. పుష్ప సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా బాగా ఉంటాయట. బన్నీ ఫ్యాన్స్ కోరుకునే విజువల్ ఫీస్ట్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు.

బాలీవుడ్ ఆడియెన్స్ కూడా మెచ్చే కథ, కథనాలతో ఈ సినిమా వస్తుందని అనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ అవుతుందని తెలుస్తుంది. మరి అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. నవంబర్ మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. 2021 సమ్మర్ లో ఈ సినిమా ఆ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.                                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: