ఇప్పటికే దేశంలో ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది స్టార్ మా. ఇప్పుడు ఆ స్థానాన్ని మరింత పదిల్లం చేసుకునేందుకు మరో కొత్త షోతో రాబోతుంది. స్టార్ మాలో కొత్తగా రాబోతున్న షో డ్యాన్స్ ప్లస్. ఓంకార్ ఆధ్వర్యంలో రాబోతున్న ఈ షో అదరగొట్టబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే డ్యాన్స్ షోలో ఢీ టాప్ లేపేస్తుంది. దాదాపు ఢీ 12 సీజన్లుగా సక్సెస్ ఫుల్ గా అది రన్ అవుతుంది. ఇక ఇప్పుడు స్టార్ మాలో కూడా అలాంటి దుమ్మురేపే డ్యాన్స్ షోని ప్లాన్ చేస్తున్నారు.

డ్యాన్స్ ప్లస్ అంటూ రాబోతున్న ఈ డ్యాన్స్ షో సరికొత్తగా రాబోతుంది. ఈ డ్యాన్స్ షోలో సోలో, డ్యుయెట్, గ్రూప్ ఇలా అన్నిట్లో ఆడిషన్స్ ను త్వరలో ప్రారంభించనున్నారు. ఇక ఈ డ్యాన్స్ ప్లస్ షోతో ఢీ షోకి ఈ రకంగా చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఓంకార్ ఇప్పటికే స్టార్ మా లో సిక్స్ సెన్స్, స్టార్ జోడీ అని రకరకాల షోస్ చేశాడు. ఇక ఇప్పుడు డ్యాన్స్ ప్లస్ తో దుమ్ముదులిపేయనున్నాడు. జీ తెలుగులో ఆటతో అదరగొట్టిన ఓంకార్ ఇక ఇప్పుడు స్టార్ మాలో డ్యాన్స్ ప్లస్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు.

డ్యాన్స్ ప్లస్ అంతకుమించి అనిపించే డ్యాన్స్ షోతో నిజంగానే ఢీని అదరగొట్టెలా చేస్తుందో లేదో చూడాలి. డ్యాన్స్ అంటే ఆస్కతి ఉన్న ప్రేక్షకులను అలరించేలా డ్యాన్స్ ప్లస్ రానుంది. దీనికి సంబందించిన ఆడిషన్స్ త్వరలో మొదలవుతాయని తెలుస్తుంది. మరి స్టార్ మాలో వచ్చే డ్యాన్స్ ప్లస్ ఎలా ఉటుందో చూడాలి.                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: