టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ సుకుమార్ కేవలం డైరక్టర్ గా మాత్రమే కాదు నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు. కుమారి 21ఎఫ్, దర్శకుడు సినిమాలను నిర్మించిన సుక్కు తన నెక్స్ట్ సినిమాను 18 పేజెస్ అంటూ తీస్తున్నాడు. నిఖిల్ హీరోగా సూర్య ప్రతాప్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను సెలెక్ట్ చేశారు.

ముందు అనుపమ పరమేశ్వరన్ నే హీరోయిన్ గా అనుకోగా ఆమె ఈ ప్రాజెక్ట్ లో చేయట్లేదని అన్నారు. ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక నటిస్తుందని అన్నారు. ఫైనల్ గా మళ్లీ అనుపమని ఫిక్స్ చేశారు. సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమకి ఈ ఛాన్స్ రావడం లక్కీ అని చెప్పొచ్చు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో ముందు అనుపమని అనుకున్నారు. అందుకు సంబందించిన ఫోటో షూట్ కూడా జరిగింది కాని ఎందుకో మళ్లీ సుకుమార్ ఆమె బదులుగా సమంతని సెలెక్ట్ చేశారు.

ఇక ఇప్పుడు సుకుమార్ నిర్మాణంలో వస్తున్న సినిమాలో అనుపమకి ఛాన్స్ ఇచ్చారు. తప్పకుండా అనుపమకి ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. క్రేజీ లవ్ స్టోరీగా రాబోతున్న 18 పేజెస్ సినిమాలో అనుపమ తన టాలెంట్ చూపిస్తే సుకుమార్ డైరక్షన్ లో సినిమాలో కూడా అవకాశం దక్కించుకోవచ్చు. 18 పేజెస్ లో అనుపమని కన్ఫాం చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసింది.                                                                                

మరింత సమాచారం తెలుసుకోండి: