బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఆరవవారం పూర్తి అయి ఏడవ వారంలోకి  ప్రవేశించింది. కానీ ఎలిమినేషన్స్ లో మాత్రం ఈసారి కూడా విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పటికి బిగ్ బాస్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు కానీ అందరూ కూడా ఆడియన్స్ చాయిస్ కి భిన్నంగానే హౌజ్ నుంచి బయటకు వచ్చారని అంటున్నారు. ఈసారి కచ్చితంగా మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. ఆమెకే తక్కువ ఓట్లు వచ్చాయని అనుకున్నారు. కానీ సడన్ గా కుమారసాయిని బయటకు పంపుతూ  బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. నిజానికి కుమార్ సాయి తన ఆటతో బాగానే టాలెంట్ చూపిస్తున్నాడు. రెండవ వారం నుంచి హౌజ్ లోకి ప్రవేశించిన ఆయన ఇపుడిపుడే స్ట్రాంగ్ అవుతున్నాడు. ఈ సమయంలో హౌజ్ నుంచి పంపేయడం అంటే ఆడియన్స్ జడ్జి మెంట్  కాదా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి.

నిజానికి మోనాల్ గజ్జర్ కుమారసాయి ఈ ఇద్దరినీ తీసుకుంటే ఆమె కనీసమాత్రంగా కూడా టాస్కులు చేయదు. అంతే కాదు ఆమె ఏ రకమైన టాలెంట్ ని కూడా హౌజ్ లో తన మటుకు చూపించిన దాఖలాలు లేవు. కానీ ఆమెను హౌజ్ లో కొనసాగించడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇది నిజమైన జడ్జిమెంటేనా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయట. బిగ్ బాస్ హౌజ్ లో కొందరు ఉండాలి అనుకున్న మీదటనే ఇలా చేస్తున్నారా అన్నది కూడా చర్చగా ఉంది.

హౌజ్ లో అఖిల్, మోనాల్ గజ్జల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, దాంతో షో కి కావాల్సినంత స్టఫ్ దొరుకుతోందని భావిస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. మరో వైపు చూసుకుంటే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ విషయంలోనూ అన్యాయం జరిగింది అన్న వారు ఉనారు. అలాగే టీవీ 9 యాంకర్ దేవి విషయంలోనూ ఇలాగే అనుకున్నారు. ఇపుడు కుమారసాయి ఎలిమినేషన్ చూసిన వారు కూడా తప్పుపడుతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ లో జంటగా ఉంటే సేఫ్ అన్న సందేశం పంపుతున్నారా అని సెటైర్లు పడుతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: