రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వెంట వెంట రెండు ఫ్లాపులు పడగానే కెరియర్ మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం పూరీ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీనుతో ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తాడని అంటున్నారు. బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా అంటే హీరో చాలా పవర్ ఫుల్ గా ఉంటాడు. అలాంటి బోయపాటి డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా అంటే మాత్రం ఆ బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నట్టే లెక్క. దిల్ రాజుతో బోయపాటి శ్రీను భద్ర తర్వాత చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విజయ్ కు స్క్రిప్ట్ లక్ కాగా త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.

బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాతో విజయ్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. తప్పకుండా విజయ్ దేవరకొండ, బోయపాటి కాంబో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని ఫిక్స్ అవ్వొచ్చు. మరి ఈ సినిమా కథ ఏంటి.. సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఫైటర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుండగా ఆ తర్వాత రెండు సినిమాలో కేవలం తెలుగు వరకే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.                                                

మరింత సమాచారం తెలుసుకోండి: