ఈ మధ్యకాలంలో బుల్లితెర టీవీ షోలకు క్రేజ్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని షోలకు యాంకర్లుగా జోడిలు ప్రేక్షకులకు అలరిస్తున్నారు. ఇంకా కొత్తగా షోలు పుట్టుకొస్తున్న జోడి కంపల్సరీ అన్నట్లుగా ఉంది పరిస్థితి. వీరి ఇద్దరి మధ్య తెరపై మాత్రం కెమిస్ట్రీని పండిస్తుంటారు. కానీ వాస్తవానికి వీరి మధ్య ఏమీ ఉండదు. వీరి కెమిస్ట్రీని చూస్తే నిజంగా వీళ్లు ప్రేమికులేమో అనే భ్రమలో ప్రేక్షకులు ఆలోచనలో పడతారు. ఇందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్, రష్మీ జంట కూడా ఉంటుంది. అలా శేఖర్ మాస్టర్, రోజాది కూడా కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. ఇద్దరూ కలిసి ఈవెంట్స్ లో స్టెప్పులేస్తే స్టేజ్ అదిరిపోతుంది.

పండుగలకు చేసే స్పెషల్ ఈవెంట్లలో రోజా శేఖర్ మాస్టర్ కు సపరేట్ ట్రాక్ ఉండాల్సిందే. స్కిట్స్ లో వ్యతిరేక టీం సభ్యులుగా, భార్యభర్తలుగా, ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసినా సరే వీరిద్దరి కెమిస్ట్రీ బాగేనే హైలెట్ గా నిలుస్తుంది. కానీ ఈ దసరా ఈవెంట్ కు రోజా దూరమైంది. ఆమె స్థానంలో నటి సంగీతను తీసుకొచ్చారు.

దసరా ఈవెంట్ లో హోస్ట్ గా సంగీతను నిర్మించారు. ఈమెంట్ మొత్తంగా ఆమె చుట్టు తిరిగేలా కనిపిస్తోంది. అక్కా ఎవరే అతగాడు అంటూ తన చెల్లెల్లకు (రష్మీ, వర్షిణీ)కి పెళ్లి చేసేందుకు అక్క అయిన సంగీత పడే పాట్లే ఈ షో నేపథ్యం. అయితే సంగీతకు తెలుగు అంతగా రాకపోవడం కాస్త మైనస్ గానే కనిపిస్తోంది. అందుకే ఆమెకు భారీ డైలాగులు ఇవ్వలేదు.

ఈవెంట్ లో శేఖర్ మాస్టర్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయే స్టేప్పులతో ప్రేక్షకులకు అలరించాడు. అయితే షోకి ఎంట్రీ ఇచ్చిన మరుక్షణంలో శేఖర్ మాస్టర్ కన్ను సంగీతపై పడింది. వెంటనే ఆమెతో పురిహార కలపడం స్టార్ట్ చేశాడు. పెళ్లైందా మీకు అంటూ శేఖర్ మాస్టర్ కొంటెగా అడగడంతో సంగీత షాక్ అవుతూ ఏంటీ అని బెదిరించింది. బెదురుతూ శేఖర్ మాస్టర్ పూజ ఇంకా చేశారా అని టాపిక్ ని డైవర్ట్ చేశాడు. ఆ వెంటనే బ్యాక్ గ్రౌండ్ లో ‘‘నీ వయసెంత నువ్ చేసే  పనులేంటి సిగ్గనిపించడం లేదా నీకు’’ అంటూ రోజా వాయిస్ వస్తుంది. దీంతో శేఖర్ మాస్టర్ షాక్ కి గురయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: