సినిమాల్లో నటించడానికి ఎంతో మంది అవకాశాల కోసం ఎదురు చూస్తారు. కానీ అవకాశాలే ఈమెని  వెతుక్కుంటూ వచ్చాయి. అనేక మందికి ఎంతో కష్టపడితే గాని అవకాశాలు రావు కానీ ఈమెకి మాత్రం  ఇలా అనేక అవకాశాలు రావడం తన లక్ అనే అనాలి. మరి ఆమె ఎవరో ఇప్పుడే పూర్తిగా చూసేయండి.   రింకు రాజ్ పుట్టింది మహారాష్ట్ర లోని షోలాపూర్ జిల్లా అక్లుజ్‌. ఆమె తల్లి దండ్రులు ఇద్దరు టీచర్లు కావడంతో ఆమె చిన్నప్పటి నుంచే చదువులో ముందు ఉండేది. ఆమెకు సోదరుడు కూడా ఉన్నాడు.

సైరాట్ విడుదలయ్యే టైంకు ఆమె 9వ తరగతి చదువుతోంది. ప్రముఖ మరాఠా నటి రింకు రాజ్‌కు సినిమా అవకాశాలు వెతుక్కుంటూనే వస్తున్నాయనడం లో ఆశ్చర్యం లేదు.  ఈ నటి  2016లో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన సైరాట్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసినదే. ఇంకేం ఉంది ఆమె కి క్రేజ్ బాగా పెరిగింది. ఇలా ఒకే ఒక్క చిత్రం తో ఈ నటి సెన్సేషన్ గా మారిపోయింది. ఈ మరాఠా సినిమా లో నటించిన  తర్వాత మనసు మల్లిగే గా రీమేక్ చేసి కన్నడలో ఓటీటీలో రిలీజ్ చేయడంతో ఆమె సౌత్‌లో కూడా పాపులర్ అయ్యింది.ఇప్పుడు ఈమె  డిస్నీ స్టార్ వెబ్‌సీరిస్ హండ్రెడ్‌లో నటించింది.

ఈమెకి జంతువులపై ఉన్న మక్కువ వల్ల  వెటర్నీరీ డాక్టర్ పూర్తి చేసింది. తాను సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ అవుతానని కలలో కూడా ఊహించలేదని చెప్పింది. ఈమె సినిమాల్లోకి ఎలా వచ్చిందంటే..?  సైరాట్ దర్శకుడు నాగరాజ్‌ది, ఆమెది ఒకే ఊరు అవ్వడంతో తనకు ఈ అవకాశం వచ్చిందన్నారు. ఆమె అడిషన్స్ కోసం తన తల్లిదండ్రులను ఒప్పించిన నాగరాజ్ ద్వారా తనకు హీరోయిన్ అవకాశం వచ్చింది. హండ్రెడ్ వెబ్‌సీరిస్ కోసం లారా దత్తాతో పోటీ పడి మరీ నటించడంతో తనకు ప్రశంసలు వచ్చాయని ఈ నటి చెప్పడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: