అవునూ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 6 సార్లు పోటీ పడ్డారు. అయితే ఆ పోటీలో ఎవరు విజయం సాధించారు అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం..
1. చిరుత vs యమదొంగ: యమదొంగ ( ఎన్టీఆర్).
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా "చిరుత". డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ "యమదొంగ" సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. రెండు సినిమాలు హిట్ అవగా కలెక్షన్స్ పరంగా "యమదొంగ" ముందుంది.
2. ఆరెంజ్ Vs బృందావనం: బృందావనం (ఎన్టీఆర్).
"బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో "ఆరెంజ్" సినిమా తెరకెక్కింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో "బృందావనం" తెరకెక్కింది. "ఆరెంజ్" ఫ్లాప్ అవగా "బృందావనం" సూపర్ హిట్ గా నిలిచింది.
3. రచ్చ Vs దమ్ము: రచ్చ (రామ్ చరణ్).
సంపత్ నంది దర్శకత్వంలో "రచ్చ" మూవీ తెరకెక్కింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో "దమ్ము" తెరకెక్కింది. "దమ్ము" డిజాస్టర్ గా నిలిచింది. "రచ్చ" మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
4. తూఫాన్ Vs రామయ్యా వస్తావయ్యా: డ్రా.
బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లఖియా దర్శకత్వంలో "తూఫాన్" మూవీ తెరకెక్కింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో "రామయ్యా వస్తావయ్యా" మూవీ తెరకెక్కింది. రెండు సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.
5. ధృవ Vs నాన్నకు ప్రేమతో: నాన్నకు ప్రేమతో(ఎన్టీఆర్).
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో "ధృవ" మూవీ తెరకెక్కింది. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో "నాన్నకు ప్రేమతో" మూవీ తెరకెక్కింది. రెండు సినిమాలు హిట్ అవగా "నాన్నకు ప్రేమతో" ఎక్కువ కలెక్షన్స్ సాధించింది.
6. రంగస్థలం Vs అరవింద సమేత వీర రాఘవ: రంగస్థలం (రామ్ చరణ్).
లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో "రంగస్థలం" మూవీ తెరకెక్కింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో "అరవింద సమేత వీర రాఘవ" మూవీ తెరకెక్కింది. "అరవింద సమేత.." బ్లాక్ బస్టర్ హిట్ అవగా "రంగస్థలం" ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 6 సార్లు పోటీ పడ్డారు. అయితే అందులో ఎన్టీఆర్ 3 సార్లు, రామ్ చరణ్ 2 సార్లు పైచేయి  సాధించారు. ఒకసారి ఇద్దరి సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: