హౌజ్ లో ఉన్నంతవరకు అతనో వీక్ కంటెస్టంట్ అనుకోగా బయటకు వస్తేనే కాని తెలియలేదు కుమార్ సాయి ఎంత స్ట్రాంగ్ అన్నది.. ఆదివారం బిగ్ బాస్ హౌజ్ నుండి కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. అతని ఎలిమినేషన్ బిగ్ బాస్ ఆడియెన్స్ కు నచ్చలేదు. మోనాల్ ను సేవ్ చేసి కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారు. కాని అసలు మోనాల్ కే హౌజ్ లో ఉండే అర్హత లేదని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కుమార్ సాయి ఎలిమినేషన్ పై ఆడియెన్స్ లో వ్యతిరేకత వచ్చింది.

ఆల్రెడీ సీజన్ 4లో దేవి నాగవల్లి ఎలిమినేషన్ టైంలో కూడా ఆడియెన్స్ షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు కుమార్ సాయి విషయంలో కూడా ఆడియెన్స్ అప్సెట్ అయ్యారు. తము వేసే ఓట్లని కాకుండా బిగ్ బాస్ నిర్వాహకులు తమ ఇష్టం వచ్చినట్టుగా ఎలిమినేషన్ ప్రక్రియ చేస్తున్నారని అంటున్నారు. ఈ సీజన్ లో మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బయటకు వచ్చిన కుమార్ సాయి సోలోగా గేమ్ ఆడుతున్నాడు. కుమార్ సాయి బయటకు వచ్చినప్పుడు ఆడియెన్స్ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే అతనికి ఈ రేంజ్ క్రేజ్ అసలు ఊహించలేదని చెప్పొచ్చు.

ఫైనల్ గా కుమార్ సాయి ఎలిమినేషన్ జరిగింది. హౌజ్ లో పులిహోర కలిపే వారికే అవకాశం ఉంటుందా.. గేమ్ ఆడకపోయినా పర్వాలేదు కాని అక్కడ పులిహోర కలిపితే చాలని వారినే బిగ్ బాస్ సేవ్ చేస్తాడని ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 4 ఎలిమినేషన్ ప్రక్రియపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.                                                              

మరింత సమాచారం తెలుసుకోండి: