చెప్పినా ఎవరూ నమ్మరు.. ఇది విస్వక్ షేన్ డైలాగ్ కాదండీ. శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో కొత్తగా నిర్మిస్తున్న చిత్రం పేరు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా రిలీజ్ కావడానికి సిద్ధమౌతోంది. కాగా.. లాక్డౌన్ తరువాత థియేటర్లలో ఈచిత్రాన్ని మొదటి చిత్రంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధం అవుతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం యొక్క చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను యంగ్ హీరో విస్వక్ షేన్ విడుదల చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ సందర్భంగా విశ్వక్ షేన్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. ఇక చిత్ర నిర్మాత అయినటువంటి డాక్టర్ ఎం. మురళి శ్రీనివాసులు మాట్లాడుతూ.. అడిగిన వెంటనే మా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించిన విష్వక్ సేన్ కి ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే సినిమా గురించి మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ ఎంతగానో నచ్చిందని, ఎక్కడ కూడా సాంకేతిక విలువలు తగ్గకుండా చిత్రాన్ని రాజీపడకుండా రూపొందించడం జరిగింది అని చెప్పుకొచ్చారు.

ఇక తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతున్న అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో వుంటాయి అని ఈ సందర్భంగా మాటిచ్చారు. అలాగే ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన ఆర్యాన్ కృష్ణ మాట్లాడుతూ… "మా చిత్ర యూనిట్ అడిగిన వెంటనే చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విస్వక్ సేన్ గారు విడుదల చేయడం చాలా ఆనందం అని, అందుకుగాను విస్వక్ సేన్ గారికి మా టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం." అని అన్నారు.

సినిమా గురించి మాట్లాడుతూ... ఇది పూర్తిగా కామెడీ త్రిల్లర్ తో కూడుకొని వున్న అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే చిత్రం అని, తప్పకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ చిత్రంలో ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ తదితరులు నటించగా.. జగ్దీద్ వేముల సంగీతం సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: