సోమవారం వచ్చింది అంటే బిగ్ బాస్ హౌజ్ లో నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. సోమవారం నామినేషన్ లో ఉంచి వారం  మొత్తం ఆటతో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసి ఓట్లు సంపాదించడం జరుగుతుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఏడవ వారం నామినేషన్ ప్రక్రియ ఈరోజు జరుగనుంది. ఈ ప్రక్రియలో భాగంగా రంగు పడుద్ది టాస్క్ ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఇద్దరు ఇద్దరుగా వచ్చి వారిలో హౌజ్ లో ఉండే అర్హత ఎవరికి ఉంది అని వివరించి నామినేట్ అయిన వారి మీద రంగు వేయాల్సి ఉంటుంది.

ఈ టాస్క్ లో భాగంగా అభిజిత్, హారిక ల మధ్య నామినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే హారికను నామినేట్ చేయాలని అభిజిత్ ప్రయత్నించగా హారిక కన్విన్స్ అవలేదు. ఆమెలోని లోపాలని ఎత్తి చూపే ప్రయత్నంలో హారిక ఇది ఫెయిర్ కాదు షటప్ అనే మాటలు ప్రోమోలో వదిలారు. చూస్తుంటే అభిజిత్, హారికల మధ్య ఈ వారం నామినేషన్ ప్రక్రియ చిచ్చు పెట్టేలా ఉంది.

ఇదే ప్రోమోలో సోహెల్, అవినాష్ ల మధ్య కూడా నామినేషన్ ఫైట్ జరిగింది. ఇద్దరిలో ఎవరు కన్విన్స్ అవలేదు. అలాంటి టైం లో బిగ్ బాస్ ఏమని డిసైడ్ చేస్తాడో చూడాలి. అయితే ఇద్దరిలో ఎవరు నిర్ణయించుకోలేనప్పుడు మిగతా హౌజ్ మేట్స్ కు ఆ డెశిషన్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి ఈ వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగనుందని తెలుస్తుంది.                                                        



మరింత సమాచారం తెలుసుకోండి: