కరోనా మహమ్మారి విజృంభించి 10-11 నెలలు కావస్తోంది. అయితే గత 7 నెలలుగా భారతదేశం కరోనా గుప్పిట్లో అతలాకుతలమవుతోంది. దీంతో చిత్ర పరిశ్రమపై కోలుకోలేని దెబ్బ పడింది అని చెప్పుకోవచ్చు. దాదాపు ఆరు నెలల పాటు థియేటర్లు మూసివేయబడ్డాయి. దాదాపు 4 నెలల వరకు సినిమా షూటింగులు కూడా జరపడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వివిధ దశల్లో ఉన్న అనేక సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అయితే కొద్ది వారాల క్రితం షూటింగులు జరుపుకోవచ్చునని థియేటర్లు తెరవొచ్చునని కేంద్ర ప్రభుత్వం సినిమా వాళ్లకు పెద్ద వెసులుబాటు కల్పించింది. దీంతో సినిమా పరిశ్రమ వాళ్ళంతా హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆగిపోయిన సినిమా షూటింగులకు పున ప్రారంభించారు. థియేటర్లలో రిలీజ్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు.


అయితే ఈ నేపథ్యంలోనే సినిమాల కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న హైదరాబాద్ నగరంలో వర్షాలు పోటెత్తాయి. దీంతో ఇప్పట్లో షూటింగులు గానీ రిలీజ్ లు గానీ జరగవని స్పష్టమవుతోంది. అకాల వర్షాల కారణంగా షూటింగ్ చేయాలనుకున్న చిత్ర బంధాలు అన్నీ కూడా వెనక్కి తగ్గాయి. ఈ కాలంలో ఎవరూ ఊహించని విధంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సామాన్య ప్రజలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ప్రజల పరిస్థితి మాటల్లో వర్ణించలేని విధంగా ఉందంటే అతిశయోక్తి కాదు. చాలా కార్లు బైకులు కొట్టుకుపోయాయి. కొన్ని మట్టిలో కూరుకుపోయాయి. కరోనాతో దేశం మొత్తం అల్లాడుతున్న నేపథ్యంలో అవుట్డోర్ షూటింగులకు కూడా ఏ చిత్రబృందం సాహసించడం లేదు. ఎక్కడ ఎప్పుడు వర్షాలు వస్తాయో చెప్పలేని పరిస్థితి నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.


హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో గతంలో నిర్మించిన అనేక సినిమా సెట్లు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా హైదరాబాద్ వర్షాల కారణంగానే ఆగిపోయిందని తెలుస్తోంది. చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాకి కూడా వర్షం కారణంగా అనే బ్రేకులు పడ్డాయి అని సమాచారం. ఏదేమైనా 2020 సంవత్సరం లో అనేక విపత్తులు అన్ని కార్యక్రమాలకు బ్రేకులు వేస్తున్నాయి. వీటిలోని భాగంగానే చిత్ర పరిశ్రమ కుదేలు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: