టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దానయ్య దాదాపు రూ. 450 కోట్ల భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు.

ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. ఇటీవల లాక్ డౌన్ కు ముందు చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కొద్ది రోజుల క్రితం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. కాగా వాటికి ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించింది.

ఇక ఈ నెల 22వ తేదీన ఎన్టీఆర్ కొమురంభీం పాత్ర ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేయనున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ టీజర్ ఎంతో అద్భుతంగా పవర్ఫుల్ గా ఉంటుందని ముఖ్యంగా ఎన్టీఆర్ పై తీసిన కొన్ని స్లో మోషన్ షాట్స్, యాక్షన్ సన్నివేశాలతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కూడా ఈ టీజర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే టీజర్ రిలీజ్ తర్వాత ఈ ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకాభిమానుల అంచనాలు విపరీతంగా పెరగడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త గనుక  నిజమైతే నందమూరి ఫ్యాన్స్ తో పాటు మెగా పవర్ మెగా ఫ్యాన్స్ కు కూడా ఇది మంచి పండుగ వార్త అని చెప్పక తప్పదు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: