ప్రముఖ కన్నడ నటుడు యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక సినిమా కేజిఎఫ్ చాప్టర్ వన్. సరిగ్గా రెండేళ్ల క్రితం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట కన్నడంలో రూపొందిన ఈ సినిమాని పలు ఇతర భాషల్లో కూడా డబ్ చేయమంటూ తెలుగు దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి ఆ మూవీ యూనిట్ కు సలహా ఇవ్వటం అలానే ఆయన చెప్పిన విధంగానే యూనిట్ ఆపై ఆ సినిమాని తెలుగు సహా పలు ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది.

ఇక దేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకున్న కేజిఎఫ్ చాప్టర్ వన్ లో హీరో యాష్ నటన అత్యద్భుతం అనే చెప్పాలి. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ గొప్ప దర్శకత్వ ప్రతిభ, హీరోయిన్ శ్రీనిధి శెట్టి అందచందాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణాలుగా నిలిచాయి అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కేజిఎఫ్ చాప్టర్ టు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా అధీర అనే పాత్రలో నటిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ నటుడు రావు రమేష్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.  

ఇక ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని వచ్చేనెల మొదటి వారంలో రిలీజ్ చేసేలా ఇప్పటికే యూనిట్ ప్లాన్ సిద్ధం చేసిందని అంటున్నారు. మరోవైపు దానికి సంబంధించి పనులు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయని మరికొద్ది రోజుల్లో ఎప్పటినుండో ఎంతగానో ఆశగా టీజర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకాభిమానుల ఆశలు నెరవేరనున్నాయని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే ఇది నిజంగా కేజీఎఫ్ మూవీ అభిమానులకు మంచి పండగ వార్త అని చెప్పక తప్పదు. ఇకపోతే ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేసేలా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: