బిగ్ బాస్ హౌజ్ లో అఖిల్, మోనాల్ ల లవ్ ట్రాక్ ఆడియెన్స్ కు ఇప్పుడు బోరింగ్ సబ్జెక్ట్ అయ్యింది. హౌజ్ లో మోనాల్ ఎలాంటి టాస్కులు చేయకుండా కేవలం అఖిల్ తో హగ్గులు ఇచ్చుకుంటూ వస్తుంది. నామినేషన్స్ లో ఉంటున్నా మళ్లీ ఆమె సేవ్ అవుతూ వచ్చింది. ఆరవ వారం హౌజ్ నుండి దాదాపు మోనాల్ బయటకు వెళ్తుందేమో అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి చివరకు కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారు. కుమార్ సాయిని ఎలిమినేట్ చేయడం పూర్తిగా తప్పని అసలు మోనాల్ ఆటే ఆడట్లేదు ఆమెను ఎందుకు ఉంచారని ఆడియెన్స్ అంటున్నారు.

అయితే ఇలాంటి టైం లో ఏడవ వారం నామినేషన్ ప్రక్రియ వచ్చింది. రంగు పడుద్ది అంటూ ఇద్దరిని పిలిచి వారిలో ఒకరి మీద రంగు చల్లి నామినేట్ చేయాలని అన్నారు. ఫైనల్ గా అఖిల్, మోనాల్ లకే ఈ టాస్క్ ఇవ్వగా అఖిల్ ఈసారి మోనాల్ కోసం త్యాగం చేయకుండా ఆమెను నామినేట్ చెశాడు. ఆరవ వారం వెళ్తుందని అనుకున్న మోనాల్ ఏడవ వారం నామినేట్ అయ్యింది.

ఇక ఆమెను ఇంటికి పంపించడమే టార్గెట్ పెట్టుకున్నారు బిగ్ బాస్ ఆడియెన్స్. ఏడవ వారం నామినేట్ అయిన వారిలో మోనాల్, దివి, నోయెల్ మాత్రమే వీక్ గా ఉన్నారు. మిగతా ముగ్గురిలో అరియానా, అభిజిత్, అవినాష్ స్ట్రాంగ్ గా ఉన్నారు. కాబట్టి ఈసారి హౌజ్ నుండి మోనాల్ కు బై బై చెప్పే అవకాశాలు పక్కాగా ఉన్నాయని చెప్పొచ్చు.                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: