న్యాచురల్ స్టార్ నానికి షాకుల మీద షాకులు కొడుతున్నాయి. మనోడు నెగటివ్ రోల్ లో చేసిన వీ సినిమా వేసిన దెబ్బ మామూలుగా లేదు. ఈ సినిమా ఆమెజాన్ కి అమ్మేసి సేఫ్ అయ్యారు కానీ, థియేటర్స్ లో రిలీజ్ చేసి ఉంటే భారీ దెబ్బ పడి ఉండేది. ఇక ఇప్పటికే ఫ్లాపుల్లో ఉన్న నానికి ఇప్పుడు నిర్మాతల నుంచి కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని అంటున్నారు. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీగా అని అనౌన్స్‌ చేసిన శ్యామ్‌ సింగరాయ్‌ కి బ్రేకులు పడుతున్నట్టు చెబుతున్నారు.

సినిమా నుండి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తప్పుకుంటోందని అంటున్నారు. నాని బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపులతో కొంచెం బ్యాడ్ ఫేజ్‌ లో ఉన్నాడు. గ్యాంగ్‌ లీడర్‌, సహా వి రిజల్ట్ తో నాని గ్రాఫ్‌ అలానే మార్కెట్ కూడా పడిపోయింది. అయితే ఈ సమయంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తప్పుకోవడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. నిజానికి నాని ముందే సితారలో జెర్సీ సినిమా చేశాడు. అది సూపర్ హిట్ అయిన రోజుల్లోనే ఈ సింగరాయ్ కి బీజం పడింది.

మరి ఇప్పుడు ఏం జరిగిందో ఏమో కానీ ఈ సినిమా చేతులు మారుతోందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని ఇప్పుడు వెంకట్‌ బోయినపల్లి హ్యాండోవర్‌ చేసుకున్నాడనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇది కాక తాజాగా  నాని కొత్త సినిమా కూడా షూట్ మొదలైంది. నిన్ను కోరి సినిమా ఫేమ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమానే టక్ జగదీష్..లాక్ డౌన్ కన్నా ముందు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టగా యూనిట్ లో ఒకరికి కరోనా సోకడంతో షూట్ అంతా బంద్ చేశారు చిత్ర యూనిట్..

మరింత సమాచారం తెలుసుకోండి: