బిగ్ బాస్ హౌజ్ లో రోజు రోజుకి తన ఆట తీరుతో అరియానా క్రేజ్ పెంచుకుంటుంది. ఇప్పటికే అరియానా నాలుగు వారాలుగా నామినేషన్స్ లో ఉంటుండగా ఆమె గేమ్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తూ సేవ్ అవుతూ వచ్చింది. ఏడవవారం నామినేషన్స్ లో రంగు పడుద్దిలో భాగంగా మెహబూబ్ తో అరియానా డీల్ జరిగింది. మెహబూబ్ ఎంతకి అరియానా చెప్పిన దానికి కన్విన్స్ అవకపోవడంతో ఆమె తను నామినేట్ అవడానికి ఒప్పుకుంది.  

చివరి వరకు మెహబూబ్ తో ఫైట్ చేసిన అరియానా ఒక వ్యక్తి తనని హెల్ప్ అడిగాడు అది నేను చేస్తున్నా అంటూ నామినేట్ అయ్యింది. అలా నామినేట్ అవడంతో ఆమెని స్టార్ ను చేసింది. హౌజ్ లో అందరు తమ ఆటతీరుతో ఆడుతున్నా ఒకానొక టైంలో ఆట నుండి బయటకు వస్తున్నారు. కాని అరియానా మాత్రం మొదటి నుండి అదే ఫోకస్ గా ఉంటుంది. అదే ఆమెను ఇన్నాళ్లు కాపాడుతూ వచ్చింది.

ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా అరియానా సాక్రిఫైజ్ ఆమెకు మరింత మైలేజ్ వచ్చేలా చేసింది. ఎంతగా అంటే దాదాపు ఆమెకు టాప్ 5 లో స్థానం కన్ఫాం చేసేలా అన్నమాట. ఇక రాను రాను హౌజ్ లో స్ట్రాంగ్ గా ఉన్న హౌజ్ మేట్స్ ఉంటున్నారు. అయితే ఇలాంటి టైం లో అరియానా తన గేమ్ ప్లాన్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తుంది కాబట్టి ఆమె కచ్చితంగా టాప్ లో ఉంటుందని చెప్పొచ్చు.                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: