టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక పేట్రియాటిక్ మూవీ ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుదిరం పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ వీడియో యూట్యూబ్లో రిలీజ్ అయి పలు సంచలనాలు క్రియేట్ చేసి మూవీపై భారీస్థాయిలో అంచనాలను పెంచడం జరిగింది.  

ఇక అతి త్వరలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ కాబోతుంది. గతంలో ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు ఒకదానిని మించి మరొకటి ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయో మనందరికీ తెలిసిందే. బాహుబలి మొదటి భాగం రూ.650 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా రెండో భాగం సినిమా దాదాపు రూ. 1900 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టింది. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తప్పకుండా ఆ రెండు సినిమాలు కలెక్షన్స్ ని బీట్ చేయడంతోపాటు భారీ స్థాయిలో గొప్ప సంచలన రికార్డులు నమోదు చేయడం ఖాయమని పలువురు ప్రేక్షకుకులు, మెగా నందమూరి అభిమానూలు  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

మరోవైపు ఈ. సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారని అలానే ఈ సినిమా విషయమై నిర్మాత దానయ్య కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగానే ఖర్చు పెడుతున్నారని అంటున్నారు. బహుబలి రెండు భాగాల తరువాత వస్తుండడం, మెగా నందమూరి హీరోలిద్దరూ కలిసి తొలిసారి నటిస్తుండడం అలానే రాజమౌళి తీసే సినిమాల సక్సెస్ రేట్ గురించి మనందరికీ తెలిసిందేనని,  మొత్తంగా చూసుకుంటే అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటివరకు ఉన్న అన్ని రకాల రికార్డులు లెక్కలను సరిచేయటం అలానే సరికొత్త రికార్డుల ను నమోదు చేయడం ఖాయమని అంటున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలి అంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: