శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా చేస్తున్నాడని అందరికి తెలిసిన విషయమే.. rx100 సినిమా తో మంచి డైరెక్టర్ గా అజయ్ భూపతి పేరు తెచ్చుకున్నాడు.. దాంతో ఆ సినిమా తర్వాత రెండో సినిమా కోసం అయన ప్రయత్నాలు చేస్తుండగా అది పలుసార్లు విఫలమయ్యింది.. అయన rx100 తర్వాత మహాసముద్రం అనే సినిమా ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తుండగా చాలామంది హీరో లు ఆ సినిమా ని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.. మొదట ఈ కథ రవితేజ దగ్గరికెళ్లింది ఆ తర్వాత నాగచైతన్య, ఆ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ ఇలా ముగ్గురిదగ్గరికెళ్ళి ఆ సినిమా కథ వెనక్కి వచ్చేసింది.. ఇప్పుడు అదే కథను శర్వానంద్ కి చెప్పి ఒప్పించాడు అజయ్..

శర్వానంద్ గత కొన్ని సినిమాలు గా ఫ్లాప్ లని ఎదుర్కొంటున్నాడు.. రాధా, మహానుభావుడు, పడిపడిలేచి మనసు, రణరంగం , జాను సినిమా లు దారుణంగా పరాయజం పాలయ్యాయి.. ప్రస్తుతం కీరవాణి, శ్రీకారం అనే చిత్రాలు ప్రోగ్రెస్ లో ఉన్నాయి.. కరోనా కారణం గా ఈ సినిమాలు నిలిచిపోయాయి.. అయితే థియేటర్లు ఇంకా ఓపెన్ కాకపోవడంతో అందరు OTT ల వైపు వెళ్తుండడంతో శర్వానంద్ శ్రీకారం కూడా OTT బాటపడుతుందని అంటున్నారు..ఇప్పటికే నాని హీరోగా, దిల్ రాజు నిర్మించిన 'వి' చిత్రం కూడా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా డైరెక్ట్ రిలీజ్ అయిపోయింది. దిల్ రాజు వంటి నిర్మాతే అలా డిజిటల్ రిలీజ్ ఎంచుకోవడంతో, మరికొందరు నిర్మాతలు కూడా ఆ మార్గాన్నే అనుసరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకారం నిర్మాత కూడా ఓటీటీ ద్వారా డైరెక్టు రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక మహాసముద్రం సినిమా కి అదనపు కలరింగ్ ఇవ్వడానికి అజయ్ ఈ సినిమాలో మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేశాడట..ఇందులో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని గతంలోనే న్యూస్ వచ్చింది. నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ ని అడిగారని కానీ రెమ్యునరేషన్ విషయంలో ఏకాభిప్రాయం రాలేదని టాక్ వచ్చింది. ఇది నిజమో కాదో కానీ ఫైనల్ గా అను ఇమ్మానియేల్ ని ఫిక్స్ చేశారు. 2016లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుకి పాపం ఇప్పటిదాకా టైం కలిసి రావడం లేదు. మరి ఈ సినిమా అయినా ఆమెకు లైఫ్ ఇస్తుందా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: