చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మామ చిరంజీవి టైటిల్ ని వాడేసి విజేత అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సూపర్ మచ్చి అనే కొత్త సినిమా చేస్తున్నాడు. పులి వాసు ఈ సినిమాకు దర్శకుడు. కరోనాకంటే ముందే ఈ సినిమా మొదలైంది. అన్ లాక్ నిబంధనలు సడలించిన తర్వాత తొలిసారిగా చిరంజీవి అల్లుడు ధైర్యం చేసి సెట్స్ పైకి వెళ్లాడు. అందరికంటే ముందే సెట్స్ పైకి వెళ్లాడని పేరు తెచ్చుకున్నా.. అదే స్పీడ్ లో రివర్స్ వచ్చేశాడు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ లో కొంతమంది కరోనా బారిన పడటంతో అర్థాంతరంగా ప్యాకప్ చెప్పేశారు.
ఇప్పుడు ఈ సినిమాకు రిపేర్లు జరుగుతున్నాయట. పులివాసు తెచ్చిన స్క్రిప్ట్ కి గతంలోనే చిరంజీవి చాలా మార్పులు, చేర్పులు చేశారు. అయితే కరోనా తర్వాత ఈ సినిమా విడుదలవుతుంది కాబట్టి.. ఈ టైమ్ లో వచ్చిన మార్పులు, మారిన ప్రేక్షకుల ఇష్టాయిష్టాల ఆధారంగా కొన్ని మార్పులు చేయాలని చిరంజీవి సూచించారట. దానికి తగ్గట్టే.. ప్రతిరోజూ దర్శకుడు పులివాసు మెగా కాంపౌండ్ కి వెళ్లి చర్చలు జరిపి వస్తున్నారట. ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తే.. సినిమా బ్యాక్ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అవుతుంది.
ఇప్పటి వరకు చేసిన పోర్షన్ లో మెగా అల్లుడు లుక్ బాగుందని, ఫస్ట్ మూవీకంటే ఈ సినిమాలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని టాక్.

ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. ఒకరిద్దరు తెరంగేట్రానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకంటూ ఓ ఐడెంటిటీ సృష్టించుకోడానికి కష్టపడుతున్నారు కల్యాణ్ దేవ్. అతనికంటే ఎక్కువగా చిరంజీవి కేర్ తీసుకుంటున్నాడు. అల్లుడిని స్టార్ గా మార్చేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. చరణ్ కెరీర్ కి కూడా చిరంజీవి ఇంత కేర్ తీసుకోలేదేమో అనేట్టు.. కల్యాణ్ కెరీర్ ని చక్కదిద్దే పనిలో పడ్డారు మెగాస్టార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: