రామ్ రెడ్ పై రోజుకో వార్త వినిపిస్తుండడంతో రామ్ అభిమానులు యా సినిమా పై కొంత కలవరపాటుకు గురవుతున్నారు..  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ అందుకున్నాడు రామ్.. ఆ సినిమా తర్వాత చేస్తున్న సినిమా రెడ్ కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ తాను కూడ ఈ సినిమా పై మంచి అంచనాలే పెట్టుకున్నాడు.. తనకు అచ్చొచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కాగ గత రెండు చిత్రాలు హిట్ అవడంతో ఈ చిత్రం తో హ్యాట్రిక్ హిట్ కొడదాం అనుకున్నారు.. కానీ కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ కి అడ్డు పడింది..

థియేటర్లు ఓపెన్ అయినా సినిమా రిలీజ్ కాకుండా పోయింది.. ఓ దశలో ఈ సినిమా OTT  లో రిలీజ్ చేయాలనీ చూశారు.. కానీ ఎందుకో కుదరలేదు.. మళ్ళీ OTT  లోనే రిలీజ్ అన్నారు.. కానీ ఇప్పుడు ఈ సినిమ ను దియేటర్ల లోనే రిలీజ్ చేయాలనీ రామ్ ఫిక్స్ అయ్యారట.. అయితే రిలీజ్ లేట్ అయ్యేలా కనిపిస్తుంది.  థియేటర్లు  గాడిలో పడే సరికి మరో మూడు 4 నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

తెలుగు డబ్బింగ్ సినిమాలతో హిందీలో మార్కెట్ బాగా పెరగడంతో  రామ్ ఇక తమిళ మలయాళ భాషల్లో పై దృష్టి పెట్టాడు. ఎలాగూ సమయం ఉండడంతో సినిమాని ఆ రెండు భాషల్లో విడుదల చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు.  థియేట్రికల్ బిజినెస్ జరగకపోయినా స్ట్రీమింగ్ శాటిలైట్  హక్కుల ద్వారా అయినా ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా నిర్మాత ఇప్పటికే హిందీ డబ్బింగ్ హక్కులు తెలుగు శాటిలైట్ హక్కులను భారీ మొత్తానికి విక్రయించినట్లు తెలుస్తోంది. అందుకే ఆలస్యమైనా సరే తెరపైనే ఈ సినిమాను చూపించేందుకు  సన్నాహాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: