హైదరాబాద్ లో తీవ్ర వాయుగుండం కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు..ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు నీళ్ళల్లో ఉండిపోయారు. నగరంలో వస్తున్న వరదల కారణంగా చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. కొందరు గల్లంతయ్యారు.. మృత దేహాలు కోసం సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి..పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు భాధిలను పరామర్శించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు జల దిగ్బంధం లో ఉన్నాయి.



ఈ మేరకు సినీ నటుడు బ్రహ్మాజీ తన ఇంటి ముందు ఉన్న దృశ్యాలను, అక్కడ నెలకొన్న వాతావరణాన్ని ఫోటో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.. అంతేకాదు ఈ పోస్ట్ కు ఒక సెటైర్ ను కూడా జత చేశాడు.ఇది మా ఇంటి పరిస్థితి.. ఓ మోటరు బోటు కొనాలనుకుంటున్నా.. దయచేసి ఏదైనా మంచి పడవ గురించి సలహా ఇవ్వండి'' అని అడిగాడు. ఈ పోస్ట్ ను చూసిన ప్రతి ఒక్కరూ కోపంతో రగిలిపోతున్నారు. నోటికి వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు.. హైదరాబాద్ వరద పరిస్థితులు, కష్టాల గురించి నీ లాంటి సెలెబ్రిటీలు జోకులు వేయడం, సెటైరికల్ కామెంట్స్ చేయడం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు.



కోటి ఆశలతో హైదరాబాద్ వచ్చి ఉంటావ్. కోట్ల రూపాయలు సంపాదించావ్. కోతి పనులు చేసి ఇజ్జత్ తీసుకోకు.. బతుకునిచ్చిన భాగ్యనగరం బాధలో ఉన్నప్పుడు కొంచెం బాధ్యతగా మాట్లాడటం మంచిదంటూ హితవు పలికారు.. అలాగే చెన్నై లాంటి మహానగరాల్లో మాత్రం వరదలు వస్తే సినీ నటులు తలా కాస్త వేసుకొని ప్రజలను ఆదుకుంటారు..కానీ హైదరాబాద్ లో అలాంటిది లేకపోవడం బాధాకరం అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ప్రస్తుతం ఈ మాటలు హాట్ చర్చ గా మారాయి.ఎన్నో సినిమాలలో నటించి విలక్షణ నటుడు గా పేరు పొందిన బ్రహ్మాజీ ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న 'అల్లుడు అదుర్స్' సినిమాలో నటిస్తున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: