బిగ్ బాస్ సీజన్ 4లో క్రేజీ కంటెస్టంట్ గా గంగవ్వ వచ్చారు. అయితే రెండు వారాల క్రితం ఆమె హౌజ్ నుండి బయటకు వచ్చేశారు. హౌజ్ లో ఆమె అనారోగ్యానికి పాలవుతున్న సందర్భంగా ఆమెని ఎలిమినేట్ చేయకుండా హౌజ్ నుండి పంపించేశారు. ఇంటి మీద బెంగ పెట్టుకున్న గంగవ్వ హౌజ్ నుండి వచ్చేసింది. అయితే గంగవ్వ వెళ్తూ వెళ్తూ తను అనుకున్నది సాధించుకుని వెళ్లింది. సొంత ఇంటి కలను సాకారం చేసుకుంది. ఏకంగా నాగార్జుననే తనకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు.

హౌజ్ లో కూడా ఉన్నతకాలం గంగవ్వ తన ఆటతో మెప్పించింది. గంగవ్వ క్రేజ్ ఎలా ఉంది అంటే హౌజ్ నుండి బయటకు వచ్చిన ఆమె ఉన్న ఊరికి అన్ని ఛానెళ్లు వచ్చేస్తున్నాయి. గంగవ్వతో ఇంటర్వ్యూలు ఆమె తిరిగే ఊరు.. చేసే పని.. పొలాలు అన్ని కవర్ చేస్తున్నారు. ఆమెకు క్రేజ్ తెచ్చిన మై విలేజ్ షో టీంను కూడా చూపిస్తున్నారు. ఆ షో వల్లే ఆమెకు సూపర్ క్రేజ్ ఏర్పడింది.

గంగవ్వ ఇప్పుడు స్టార్ గా ఏర్పడింది. బిగ్ బాస్ హౌజ్ లో ఆమె ఉన్నంతకాలం తనని ఏ పని చేయొద్దని చెప్పినా సరే ఆమె ఊరకనే కూర్చోకుండా తనకు చేతనైన పని చేస్తూ వచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ వల్ల 60 ఏళ్లు దాటిన ఈ వయసులో గంగవ్వకు సూపర్ క్రేజ్ వచ్చింది. తప్పకుండా ఆమె మరింత పాపులారిటీ సంపాదిస్తుందని చెప్పొచ్చు.                                                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: