ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా  ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జీవిత కథ ఆధారంగా చేసుకుని ఎంతో మంది సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇలా బయోపిక్ లదే హవా  ఎక్కువ అయిపోతుంది. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నాయకులు ఆటగాళ్లు సినిమా సెలబ్రిటీల కు సంబంధించిన జీవిత కథను  ఆధారంగా తీసుకుని సినిమాలు తెరకెక్కిస్తుండటం..  ఆ సినిమాలను ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆదరిస్తూ ఉండడంతో మంచి విజయాలు అందుకుంటున్నాయి.



 ఇలాంటి సినిమాలకు కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేకుండా నిజ జీవిత కథ లోనే  కొన్ని సినిమాటిక్ మార్పులు చేస్తే సరి పోతుండడంతో అటు  దర్శక నిర్మాతలు కూడా ఎక్కువగా ఇలాంటి సినిమాలను తెరకెక్కించేందుకు  ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది భారతీయ సినీ క్రీడా రాజకీయ రంగంలోని ప్రముఖులకు సంబంధించిన బయోపిక్ లు  తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఓ బాక్సర్ కి సంబంధించిన బయోపిక్ తెరకెక్కుతోంది. కానీ అది టాలీవుడ్ లోనో  బాలీవుడ్ లోనో  కాదు.. ఏకంగా హాలీవుడ్ లో భారతీయ బాక్సర్ కు సంబంధించిన సినిమా తెరకెక్కడం  ఆసక్తికరంగా మారింది.



 పర్దీప్ నగ్ర  అనే బాక్సర్ జీవిత కథ ఆధారంగా హాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కించారూ. ఈ సినిమాకు టైగర్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. కెనడా లో పుట్టి పెరిగిన  పర్దీప్ నగ్ర ఒక ప్రొఫెషనల్ బాక్సర్. తన కెరీర్లో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని అంచెలంచెలుగా  పర్దీప్ నగ్ర.. నేషనల్ ఛాంపియన్షిప్ లో ఆడాలి అంటే గడ్డం తీయాలి అంటూ నిబంధన పెట్టడంతో దాన్ని తిరస్కరించాడు. ఇక ఆ తర్వాత ఇదే విషయంపై కోర్టులో పిటిషన్ వేసి న్యాయపోరాటం చేసి గెలిచి ఆ తర్వాత గడ్డం తోనే బాక్సింగ్ పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలను సాధించాడు  పర్దీప్ నగ్ర. కెనడా స్కూల్లో పర్దీప్ పేరుమీద ఒక పాఠం  కూడా ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: