2024 లేదా ఈ లోపు జరిగే ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నా సరే ఆ పార్టీకి కొన్ని పరిస్థితులు మాత్రం ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కలిసొచ్చే అవకాశం ఉండకపోవచ్చు అనే భావన వ్యక్తమవుతోంది. చాలా రాష్ట్రాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సరే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లేవు అనే భావన వ్యక్తమవుతోంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేవన్నీ కబుర్లు మాత్రమే అనే భావన కూడా ప్రజలు ఎక్కువగా ఉంది.

కేవలం ఆయన ప్రచారం మినహా దేశానికి చేసిందేమీ లేదు అనే భావన కూడా చాలామందిలో ఉంది. దీంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లడానికి కాస్త ఎక్కువగానే కష్టపడుతుంది. మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినీ పెద్దలను బిజెపిలోకి ఆహ్వానించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని తమ వైపు తిప్పుకున్న బీజేపీ నేతలు త్వరలోనే మరికొంతమంది తెలుగు హీరోలను కూడా తమ వైపు తిప్పుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మరి ఇవి ఎంతవరకు ఫలిస్తాయి ఏంటి అనేది తెలియదు. కానీ కొంతమంది స్టార్ హీరోలను బిజెపి ప్రచారానికి వాడుకునే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనలను తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసే విధంగా స్టార్ హీరోలను వాడుకునే ఆలోచన చేస్తోంది. త్వరలోనే మహేష్ బాబుని ఒక కేంద్ర ప్రభుత్వ పథకానికి నియమించే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా చిరంజీవిని కూడా ఒక కేంద్ర ప్రభుత్వ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా తెలుగు రాష్ట్రాల్లో చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: