మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతానికి కన్‌ఫ్యూజన్‌ లోనే ఉన్నాడు. నెక్ట్స్ ఏం చెయ్యాలో తేల్చుకోలేకపోతున్నాడు. ఎలాంటి స్టెప్‌ తీసుకుంటే ఎలాంటి రిజల్ట్‌ వస్తుంది.. ఏం చేస్తే బెటర్‌గా ఉంటుందనే డైలామాలోనే ఉండిపోయాడు. రామ్ చరణ్‌ చేస్తున్న ప్రస్తుత మూవీ ఆర్ ఆర్ ఆర్. జూ.ఎన్టీఆర్, చరణ్‌ కలిసి నటిస్తోన్న ఈ మల్టీస్టారర్‌పై బోల్డన్ని అంచనాలున్నాయి. మొన్ననే ఈ మూవీ మళ్లీ సెట్స్‌కి వెళ్లింది. వచ్చే ఏడాది కల్లా షూటింగ్‌ పూర్తి చెయ్యాలని టార్గెట్‌ పెట్టుకున్నాడు రాజమౌళి.

అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌ తర్వాత ఎలాంటి సినిమా చెయ్యాలన్నది మాత్రం తేల్చుకోలేకపోతున్నాడు చరణ్. అయితే  రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని అంటున్నారు. అంటే సినిమా చేయడం అనే వారు ఒక సినిమాలో కలిసి నటించబోతున్నారని కాదు కాని రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ సినిమా ఒకదాన్ని నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రామ్ చరణ్ మరియు మాటినీ ఎంటర్టైన్మెంట్స్ పవన్ సినిమా ఒకదానిని నిర్మించటానికి సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు.

చరణ్ పేరును మాత్రమే  వాడుకుంటారని అందుకోసం ఆయన లాభాల నుండి వాటా తీసుకుంటారని చెబుతున్నారు. అయితే, ఈ వార్తలకు సంబంధించి అధికారిక ధృవీకరణ అయితే లేదు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంతకు ముందు కూడా ఇదే రకమైన ప్రచారం జరిగినా మళ్ళీ సైలెంట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇదే రకమైన ప్రచారం మొదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: