మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుస సినిమాలు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ముందు చరణ్ పార్ట్ పూర్తి చేసి ఆ తరువాత చిరంజీవి పార్ట్ షూట్ చేసే పనిలో ఉన్నాడట కొరటాల. అయితే చిరంజీవి స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువగా రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపిస్తుండడం షాకింగ్ గా మారింది.

నిజానికి ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ఓకే చేసిన చిరు.. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో ‘లూసిఫర్’ రీమేక్ కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలే అనుకుంటే  ఇప్పుడు  మరో రీమేక్ పై చిరు దృష్టి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే తమిళంలో హిట్ అయిన ‘ఎన్నై అరిందాల్’ సినిమా. నిజానికి ఈ సినిమాని తెలుగులో ‘ఎంతవాడు గానీ’ అనే టైటిల్ తో డబ్ చేసి రిలీజ్ కూడా చేశారు. అయినా మళ్ళీ ఈ సినిమా తెలుగు రైట్స్ కూడా కొన్నారని అంటున్నారు.

నిజానికి లూసిఫర్ పరిస్థితి కూడా అదే. ఆ మలయాళం సినిమా ఇప్పటికీ ఆమెజన్ లో ఉంది. మళ్ళీ వీళ్ళు కోట్లు వెచ్చించి సినిమా కొని దానిని తీయడం ఏమిటో అర్ధం కాని పరిస్థితి. అయితే నిజానికి గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అజిత్ సినిమా వీరమ్ సినిమా తెలుగులో డబ్ అయినా మళ్ళీ కాటమ రాయుడు పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. అంత దెబ్బ పడినా చిరు జాగ్రత్త పడక పోవడం ఏమిటో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: