కోవిడ్ పుణ్యమా అని ప్రజల జీవన సరళిలో మాత్రమే కాకుండా ఉద్యోగాల నియామకాల తీరులో కూడ అనేక మార్పులు జరుగుతున్నాయి. గతంలో లా కంపెనీలు ప్రస్తుత పరిస్థితులలో శాశ్విత ఉద్యోగులను నియమించుకునేందుకు ఇష్టపడటం లేదు. డిమాండ్ కు తగ్గట్టుగా తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవడానికి మాత్రమే ఆశక్తి కనపరుస్తున్నాయి.


అమెరికా యూరప్ దేశాలలో యిలా నియమించుకున్న తాత్కాలిక ఉద్యోగులను ‘గిగ్’ ఉద్యోగులుగా పిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక సంపన్నదేశాలలో కూడ ఈ కరోనా పరిస్థితులు వల్ల ఇలాంటి తాత్కాలిక ఉద్యోగులను ఆరు నెలల సమయానికి సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చి నియమించుకుంటున్నారు. ఈ పద్ధతి ఇప్పుడు మనదేశంలోని కంపెనీలు కూడ అనుసరిస్తూ ఉండటంతో చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయని ప్రముఖ ఆన్ లైన్ జాబ్ పోర్టల్ ఒక విశ్లేషణలో తెలియ చేసింది.


అయితే ఇలాంటి ఉద్యోగాలలో జీతాలలో స్థిరత్వం ఉండక పోవడంతో పాటు కనీస వేతనాలు పని గంటలు సెలవులకు చట్టపరమైన బద్రత లేకపోవడంతో మన దేశంలోని అనేక కంపెనీలకు చెందిన ఈ తాత్కాలిక ఉద్యోగులు చాల సమస్యలు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పద్ధతి అనేక కంపెనీలకు మాత్రం అనువుగా ఉండటంతో తమ ఖర్చులు తగ్గుతున్నాయని అనేక మల్టీ నేషనల్ కంపెనీలు ఈ పద్ధతిని ఆచరిస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా దీపావళి పండుగల సీజన్ కొనసాగుతున్న పరిస్థితులలో అనేక ఈకామర్స్ కంపెనీలు తాత్కాలికంగా పనిచేసే డెలివరీ ఏజెంట్లు వేర్ హౌస్ హెల్పర్స్ అసెంబ్లీ లైన్ ఆపరేటర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం ఇలాంటి ఉద్యోగాలతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ భారత్ లో కూడ బాగా పెరిగిన పరిస్థితులలో అనేకమంది స్త్రీలు కూడ తాత్కాలిక ఉద్యోగాలలో నియమింపబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా కరోనా కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులలో ఈ పండుగల సీజన్ లో జనం కనీస జాగ్రత్తలు కూడ పాటించకుండా విపరీతంగా బయటకు వస్తున్న పరిస్థితులలో దసరా దీపావళి తరువాత కరోనా కేసుల పరిస్థితి ఎలా ఉంటుంది అన్న భయం చాలామందిలో ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: