హీరో సిద్ధార్థ్.. ఒకప్పుడు లవ్, క్రేజీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. సిద్ధార్థ్ సినిమా వస్తుందంటే.. స్టార్ హీరో రేంజ్ బజ్ లేనప్పటికీ లవర్స్ మాత్రం మిస్ అయ్యే వారు కాదు. "బాయ్స్", "నువ్వొస్తానంటే నేనొద్దంటానా", "బొమ్మరిల్లు" వంటి సినిమాలతో ఫ్యామిలీ మరియు యూత్ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అయితే అదంతా అపుడు. ఇపుడు పరిస్థితి వేరు. వరుస ఫెయిల్యూర్స్ రావడంతో తెలుగులో సినిమాలు తగ్గించాడు. తమిళ్ లోనే సినిమాలు చేసుకుంటున్నాడు. కానీ అప్పుడప్పుడు మంచి సినిమా అనిపిస్తే తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. అయితే హీరో సిద్ధార్థ్ నటించిన సినిమాల లిస్టు మరియు వాటి ఫలితాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
1. బాయ్స్: సూపర్ హిట్
2. నువ్వొస్తానంటే నేనొద్దంటానా: బ్లాక్ బస్టర్ హిట్
3. చుక్కల్లో చంద్రుడు: ఫ్లాప్
4. బొమ్మరిల్లు: బ్లాక్ బస్టర్ హిట్
5. ఆట: హిట్
6. కొంచెం ఇష్టం కొంచెం కష్టం: హిట్
7. ఓయ్: ఫ్లాప్
8. బావ: ఫ్లాప్
9. అనగనగా ఓ ధీరుడు: డిజాస్టర్
10. 180: ఫ్లాప్
11. ఓ మై ఫ్రెండ్: ఏవరేజ్
12. లవ్ ఫెయిల్యూర్: సూపర్ హిట్
13. జబర్దస్త్: డిజాస్టర్
14. మనలో ఒకడు: ఏవరేజ్
15. గృహం: సూపర్ హిట్
అయితే హీరో సిద్ధార్థ్ ఇప్పటివరకూ దాదాపుగా 15 తెలుగు సినిమాలు (హీరోగా మాత్రమే) చేశాడు. వాటిలో "నువ్వొస్తానంటే నేనొద్దంటానా", "బొమ్మరిల్లు" వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ మరియు 6 హిట్స్ ఉన్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. హీరో సిద్ధార్థ్ తెలుగులో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. "ఆర్ఎక్స్ 100" తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తన తర్వాతి సినిమా "మహా సముద్రం" లో హీరో శర్వానంద్ తో కలిసి నటిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ "మహా సముద్రం" సినిమాతో అయినా సిద్ధార్థ్ మునుపటి ఫాం అందుకుంటాడో లేదో!

మరింత సమాచారం తెలుసుకోండి: