ఇక మరోపక్క సుకుమార్ నిర్మాణంలో 18 పేజెస్ సినిమాలో కూడా నటిస్తున్నాడు నిఖిల్. సుకుమార్ లాంటి స్టార్ డైరక్టర్ కథ అందించగా కుమారి 21ఎఫ్ డైరక్టర్ సూర్య ప్రతాప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సుకుమార్ మార్క్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాతో నిఖిల్ సరైన ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. 18 పేజెస్ లో నిఖిల్ పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.
సుకుమార్ నిర్మాణం.. సూర్య ప్రతాప్ డైరక్షన్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి. తప్పకుండా కార్తికేయ 2, 18 పేజెస్ రెండు సినిమాలు నిఖిల్ కు మంచి క్రేజ్ తెచ్చేలా ఉన్నాయి. నిఖిల్ కూడా ఈ రెండు సినిమాల మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. 18 పేజెస్ మూవీ మాత్రం యూత్ ఆడియెన్స్ కు నచ్చేలా మంచి లవ్ స్టోరీతో వస్తుందట. మరి నిఖిల్ ఈ రెండు సినిమాలతో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి.