ఎప్పటి నుండో అనేక షోస్ వంటివి చేస్తూ సుమ ఎంత గానో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు వస్తున్న యాంకర్స్ కి కూడా యాంకర్ సుమ ఆదర్శమే. అంత చక్కగా రాణిస్తోంది ఈమె. ఇది ఇలా ఉండగా తాజాగా  స్టార్ యాంకర్ సుమ కనకాల కూడా జబర్దస్త్ ‌లో అడుగు పెట్టింది. జబర్దస్త్ కామెడీ షోలో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ తమదైన శైలి లో ఎంట్రీ ఇవ్వడం చూసాం. ఈ షోలో మనం సీనియర్ నటులు కూడా రావడం మనం చూసాం. కానీ సుమ ఇప్పుడు రావడం విశేషంగా మారింది.

సాధారణంగా షో లోకి రావాలంటే ఖచ్చితంగా ఆ సెట్‌ లో అడుగు పెట్టాలి. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. బిజీ బిజీగా ఉండే సుమ దగ్గరకి వెళ్లి చేసుకోవాలంతే. నిజమే ఇక్కడ కూడా అలానే జరిగింది.  ఈమె తన ప్రోగ్రామ్‌ తో తాను బిజీగా ఉంటే.....అక్కడికే జబర్దస్త్ స్కిట్ నడుచుకుంటూ వెళ్ళింది. ఇది ఇలా ఉండగా  వచ్చే వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ ‌లో సుమ కనకాల కనపడనుండి. ఈమెతో పాటు కెవ్వు కార్తిక్ టీం కూడా  కనపడనుండి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే  స్టార్ మహిళ లొకేషన్‌కే కార్తిక్ టీం వెళ్లడం.

ఇదంతా స్కిట్ కాన్సెప్ట్. సుమ స్టార్ మహిళ సెట్‌కు వెళ్లిపోతారు ఈ టీమ్. కెవ్వు కార్తిక్ భార్యకు స్టార్ మహిళ లో పాల్గొనాలని పిచ్చి ఉండడం మూలానే ఇలా జరుగుతుంది. రష్మి గౌతమ్ కూడా దీనిలో ఉంది.  రష్మీ  సెటైర్ కి సుమ తనదైన స్టైల్‌లో సెటైర్ వేసింది. సుమ, రష్మితో పాటు కెవ్వు కార్తిక్, ఇమ్మాన్యువల్ కూడా దీనిలో పాల్గొన్నారు.  జబర్దస్త్ లో సుమ ఎంట్రీ ఇచ్చేయడం వావ్ అనే అనాలి.  మరి ఫుల్ స్కిట్ ఎలా ఉండబోతుందో చూడాలంటె ప్రేక్షకులు అంతా వేచి ఉండక తప్పదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: