మన తెలుగు లో కొంతమంది నిర్మాతలు ఇప్పుడు చాలా వరకు కూడా హీరోయిన్ల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. అందులో ప్రధానంగా ఇతర భాషల్లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లను ఇక్కడ తీసుకోవడానికి ఒకటికి వందసార్లు ఆలోచించే పరిస్థితి టాలీవుడ్ లో ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే కొంతమంది హీరోయిన్లకు మాత్రం తెలుగులో చాలా మంచి డిమాండ్ ఉంది అని అంటున్నారు. ప్రధానంగా సాయి పల్లవి కోసం చిన్న హీరోలు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా నాని శర్వానంద్ వంటి హీరోలు సాయి పల్లవితో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. అదే విధంగా నాగచైతన్య లాంటి హీరో కూడా ఇప్పుడు సాయి పల్లవి తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆమెను తన సినిమాలో తీసుకునే విధంగా ప్లాన్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సినిమాల్లో రెమ్యూనరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేస్తోందని అంటున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ సినిమాలో ఒక పాత్ర చేయడానికి గాను ఆమె దాదాపుగా 40 లక్షలు డిమాండ్ చేసిందని అంటున్నారు.

ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం పది నిమిషాలు మాత్రమే ఉంటుందని ఆ పది నిమిషాల కోసం ఆమె 40 లక్షలు అడగటంతో దర్శకనిర్మాతలు కూడా ఒక రకంగా షాక్ అయ్యారని సమాచారం. అయినా సరే ఆమె అయితేనే బాగుంటుంది అని భావించి ఒప్పించటం జరిగిందట. ఇక ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ కి వెళ్తుంది ఏంటి అనేది తెలియదు. ఇక ఇతర హీరోల సినిమాల్లో కూడా సాయిపల్లవి అదేవిధంగా డిమాండ్ చేస్తుందని సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు తెలుగులో తనకున్న డిమాండ్ ను మాత్రం చాలా చక్కగా వాడుకునే ప్రయత్నం చేస్తూ దూసుకుపోతోంది. మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: