టాలీవుడ్ లో ఇప్పుడు కీర్తి సురేష్ హవా అనేది కాస్త ఎక్కువగానే కొనసాగుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కీర్తి సురేష్ తో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు అదేవిధంగా స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. స్వయంగా మహేష్ బాబు కీర్తి సురేష్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు కీర్తి సురేష్ కోసం మహేష్ బాబు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

అసలు కీర్తి సురేష్ మహేష్ బాబు కి అంత క్రేజ్ ఎందుకు ఏంటి అనేది తెలియదు కానీ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా సాంప్రదాయంగా వుంటుంది అని అందుకే మహేష్ బాబు కీర్తి సురేష్ అయితే బాగుంటుంది అనే భావన వ్యక్తం చేసి పట్టుబట్టి మరీ ఆమెను ఈ సినిమాకి తీసుకుని వచ్చాడని అంటున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఏమాత్రం కూడా స్కిన్ షో చేసే అవకాశం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయినా సరే మహేష్ బాబు మాత్రం ఆమెను కావాలని పట్టుబట్టడం దీంతో దర్శక నిర్మాతలు కూడా కీర్తి సురేష్ కోసం దాదాపు మూడు నెలలపాటు కష్టపడి ఆమె ఒప్పించారని అంటున్నారు.

అయితే మహేష్ బాబు సినిమా కీర్తి సురేష్ అంత పట్టుదల ఎందుకు ఉంది అనేది చాలా మందికి ప్రశ్నగా ఉంది. వాస్తవానికి ఈ సినిమాలో ముందు స్కిన్ షో ఎక్కువగా చేయాల్సి ఉంటుందని చెప్పారట. దీనితో ఆమె ఆసక్తి చూపించలేదని, తప్పదు అని చెప్పినా సరే కీర్తి సురేష్ మాత్రం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని దీనితో స్వయంగా మహేష్ బాబు రంగంలోకి దిగి ఆ కథలో మార్పులు చేయించి మరీ ఆమెను ఒప్పించాడు అంటున్నారు. ముందు ఆమె పాత్ర కాస్త మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నా సరే... ఆ తర్వాత ఆమెను ఒప్పించడానికి ఇలా చేశాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: